బండి సంజయ్ సభలో వ్యక్తి హల్ చల్.. పెట్రోల్ బాటిల్‌తో వేదిక ఎక్కేందుకు యత్నం..

Published : Aug 07, 2022, 03:50 PM IST
బండి సంజయ్ సభలో వ్యక్తి హల్ చల్.. పెట్రోల్ బాటిల్‌తో వేదిక ఎక్కేందుకు యత్నం..

సారాంశం

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్న సభలో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. చేతిలో పెట్రోల్ బాటిల్ పట్టుకుని వేదికపైకి వెళ్లేందుకు యత్నించాడు. దీంతో సభలో తీవ్ర కలకలం రేగింది.   

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్న సభలో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆదివారం భూదాన్ పోచంపల్లిలో నిర్వహించిన సభలో బండి సంజయ్ పాల్గొన్నారు. అయితే ఆ సభలో ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నం చేశాడు. చేతిలో పెట్రోల్ బాటిల్ పట్టుకుని వేదికపైకి వెళ్లేందుకు యత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ వైపు బండి సంజయ్‌ ప్రసంగం కొనసాగిస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. 

ఇక, మరోవైపు ఈ సభలో ప్రసంగించిన బండి సంజయ్.. చేనేత వ్యవస్థను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. చేనేత కార్మికులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం ఆదుకోవడం లేదని విమర్శించారు. పంజాబ్‌లో చనిపోయిన రైతులకు సాయం చేసిన కేసీఆర్‌కు.. రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చేనేత కార్మికులు నేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్