తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది.. వచ్చేది మేమే: బండి సంజయ్ జోస్యం

Siva Kodati |  
Published : Jul 27, 2022, 02:25 PM IST
తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది.. వచ్చేది మేమే: బండి సంజయ్ జోస్యం

సారాంశం

తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కుటుంబ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని.. తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్య , ఉచిత వైద్యం అందిస్తామని సంజయ్ స్పష్టం చేశారు

తెలంగాణలో బీజేపీ (bjp) గ్రాఫ్ పెరుగుతోందన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay). బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్న బండి సంజయ్.. అధికారంలోకి వస్తే ఉచిత విద్య , ఉచిత వైద్యం అందిస్తామని సంజయ్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ (trs) ప్రభుత్వం ఏ హామీని నిలబెట్టుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు. 

ఇకపోతే కొద్దిరోజుల క్రితం వేములవాడలో జరిగిన ‘ప్రజాగోస- బీజేపీ భరోసా బైక్ ర్యాలీలో బండి సంజయ్ మాట్లాడుతూ.. తెరాస, కాంగ్రెస్ రెండు ఒక్కటేన‌నీ విమ‌ర్శించారు.  రాష్ట్ర‌ప‌తిగా ద్రౌప‌తి ఎన్నిక కావ‌డంపై ప్ర‌జ‌లు సంతోషం వ్యక్తం చేస్తున్నార‌ని అన్నారు. గిరిజ‌న బిడ్డను రాష్ట్రపతిగా నిలబెట్టిన ఘ‌న‌త బీజేపీదేన‌ని అన్నారు. పార్లమెంట్ లో తెరాస, కాంగ్రెస్ (congress) కలిసి పోయాయని ఆరోపించారు.  రాష్ట్రపతిగా గిరిజ‌న బిడ్డ ఎన్నిక కావ‌డం చాలా సంతోషంగా ఉంద‌నీ, ఆ ఘ‌న‌త‌ బీజేపీతోనే సాధ్య‌మైంద‌ని అన్నారు.

Also Read:BJP Bandi Sanjay: 'ప్రజలకు అందుబాటులో లేని ఎమ్మెల్యేపై ఎందుకంతా ప్రేమ..?' సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ ఆగ్ర‌హం

సీఎం కేసీఆర్ (kcr) మాట త‌ప్ప‌ాడనీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా దళిత అభ్య‌ర్థిని చేస్తాన‌నీ ప్ర‌గ‌ల్భాలు ప‌లికి .. చివ‌రి తానే సీఎం కూర్చీలో కూర్చున్న‌డని విమ‌ర్శించారు. తెలంగాణ‌లో కేసీఆర్ కుటుంబ పాల‌న కొన‌సాగుతోందనీ, వారి దోపిడికి అడ్డుఅదుపు లేకుండా పోయింద‌నీ, కేంద్ర ప్రభుత్వ ఇస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుందని సంజయ్ విమ‌ర్శించారు.  కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు ఒక్కటైనా బీజేపీని ఢీ కొట్టలేర‌ని, బీజేపీ సింహంలా.. సింగిల్ గా వస్తుందని అన్నారు. 

వేములవాడ ఎమ్మెల్యే ఏ దేశం లో ఉన్నాడో ఎవ‌రికీ  తెలియదనీ, ప్రజలకు అందుబాటులో లేని ఎమ్మెల్యే పై సీఎం కేసీఆర్ కి ఎందుకు అంత ప్రేమ..? అని బండి సంజయ్ ప్ర‌శ్నించారు.  రాజన్న గుడికి ఏటా 100 కోట్లు అంటివి...నిధులు ఎందుకు ఇవ్వడం లేదు..పేదల దేవుడు అని అభివృద్ధి చేయాల‌ని లేదా? అన్ని కరీంనగర్ ఎంపీ ప్ర‌శ్నించారు. ప్రసాదం స్కీమ్ కింద అప్లై చేస్తే.. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని, దేవుడ్ని కూడ మోసం చేస్తున్న వ్యక్తి కేసీఆర్ అని బండి సంజయ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?