వరద సహాయంపై కేంద్రంపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదు: రేవంత్ రెడ్డి

By narsimha lode  |  First Published Jul 27, 2022, 2:23 PM IST

రాష్ట్రానికి వరద సహాయం విషయంలో కేంద్రంపై కేసీఆర్  పోరాట  కార్యాచరణను ప్రకటించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 
 


న్యూఢిల్లీ: రాష్ట్రానికి వరద సహాయం విషయంలో కేంద్రంపై KCR  ఎందుకు నోరు మెదపడం లేదని టీపీసీసీ చీఫ్ Revanth Reddy  ప్రశ్నించారు. Gujarat రాష్ట్రానికి వేల కోట్లు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. వరద సహాయం చేసే విషయమై ప్రధానిని కేసీఆర్ ఎందుకు నిలదీయడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రధానిపై కేసీఆర్ పోరాట కార్యాచరణను ప్రకటించాలన్నారు.

బుధవారం నాడు న్యూఢిల్లీలో  టీపీసీసీ చీఫ్ Revanth Reddy  మీడియాతో మాట్లాడారు.  పార్లమెంట్ లో వరద సహయం గురించి లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది తమ పార్టీయేనని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.Godavariకి వచ్చిన వరదల నేపథ్యంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై ప్రధానిని అపాయింట్ మెంట్ కోరినట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో వరదలు, వర్షాలతో సుమారు రూ. 1400 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని రేవంత్ రెడ్డి చెప్పారు.40 మంది తెలంగాణ ప్రజలు చనిపోయారని ఆయన చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయన్నారు. 40 మంది చనిపోతే 40 కుటుంబాలు అనాధలైనట్టేనన్నారు. ఆ కుటుంబాలను ఆదుకోవడానికి కేంద్ర సర్కార్ ఏం చర్యలు తీసుకొందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.  రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బృందాలను పంపి నష్టాన్ని అంచనా వేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి తక్షణంగా వెయ్యి కోట్లను విడుదల చేయాలని రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

Latest Videos

undefined

గోదావరి పరివాహక  ప్రాంతాల్లో వర్షాలు, వరదల వల్ల కేంద్రం ఏ మేరకు నిధులు ఇచ్చిందో కేంద్ర మంత్రి Kishan Reddy  చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ఇన్ని నిధులు విడుదల చేశామని చెప్పడం కంటే ఇప్పుడు ఎన్ని నిధులు విడుదల చేశారో చెప్పాలని రేవంత్ రెడ్డి కోరారు. 

గుజరాత్ లో వరదలు వస్తే కేంద్ర ప్రభుత్వం రూ. 1000 కోట్లు శచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.  ఢిల్లీకి వచ్చిన సీఎం కేసీఆర్ మూడు రోజులుగా ఇంటికే పరిమితమయ్యారన్నారు. ఢిల్లీలో ప్రకంపనలు సృష్టిస్తామన్న కేసీఆర్ వరద సహాయంపై కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదో చెప్పాలన్నారు.  మోడీ, కేసీఆర్ లు రాష్ట్ర ప్రభులకు అన్యాయం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

also read:పార్టీలో చర్చిస్తాం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ పై రేవంత్ రెడ్డి

ఎఐసీసీ చీఫ్ సోనియా గాంధీని ఈడీ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. నిత్యావసర సరుకుల ధరల పెంపు విషయమై పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహలపై తాము ఇప్పడు దృష్టి పెట్టినట్టుగా చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా గోదావరి పరవాహక ప్రాంతాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. పంటలతో పాటు ఇళ్లు దెబ్బతిన్నాయి. రాష్ట్రాన్ని వర్షాలు ఇంకా వీడడం లేదు. ఇంకా మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. దీంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

click me!