ఢిల్లీ లిక్కర్ స్కాంతో కేసీఆర్ ఫ్యామిలీకి లింక్.. కేటీఆర్ స్పందించరేం: బండి సంజయ్ చురకలు

By Siva KodatiFirst Published Aug 22, 2022, 6:05 PM IST
Highlights

ఢిల్లీలో లిక్కర్ స్కాంపై సీఎం కేసీఆర్‌పై ఆరోపణలు వస్తున్నాయన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. కుటుంబ సభ్యులపై ఆరోపణలు వస్తే కేటీఆర్ ఎందుకు ట్వీట్ చేయడం లేదని ఆయన చురకలు వేశారు.
 

ఢిల్లీలో లిక్కర్ స్కాంపై సీఎం కేసీఆర్‌పై ఆరోపణలు వస్తున్నాయన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ ఆరోపణలపై కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. రామచంద్ర పిళ్లై, అభిషేక్‌తో సంబంధాలు వున్నాయా ..? లేదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. కుటుంబ సభ్యులపై ఆరోపణలు వస్తే కేటీఆర్ ఎందుకు ట్వీట్ చేయడం లేదని ఆయన చురకలు వేశారు. ప్రతీ స్కాంలో కేసీఆర్ ఫ్యామిలీ పాత్ర వుందని బండి సంజయ్ ఆరోపించారు. 

లిక్కర్ స్కాంలో కాంగ్రెస్ నేతల పాత్ర కూడా వుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో కేసీఆర్ కుటుంబం, కాంగ్రెస్ నేతల దందా వుందని బండి సంజయ్ ఆరోపించారు. అమిత్ షా టచ్ చేస్తే బీజేపీ కార్యకర్తలు అదృష్టంగా భావిస్తారని.. అమిత్ షా తనకు గురువు లాంటి వారన్నారు. పాదయాత్రలో కార్యకర్తల చెప్పులు కూడా తన చేతులతోనే ఇస్తానని టీఆర్ఎస్ ప్రచారానికి చెక్ పెట్టారు. కేసీఆర్ పెద్దలకు మాత్రమే గులాంగిరీ చేస్తారంటూ బండి సంజయ్ చురకలు వేశారు.

అంతకుముందు సంజయ్‌పై టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించిన సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఆయనకు చెప్పులు అందించినట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీనిని షేర్ చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు.. గుజరాత్ నాయకులకు ఉరికి ఉరికి చెప్పులు తొడగడం తెలంగాణ ఆత్మగౌరవమా ? అంటూ బండి సంజయ్‌ను ప్రశ్నిస్తున్నారు. భవిషత్తులో అమిత్ షా కాళ్ల దగ్గర తెలంగాణను తాకట్టు పెడతారనడానికి ఈ ఘన ఉదాహరణ అంటూ పోస్టులు చేస్తున్నారు. ఎందుకింత బానిసత్వం? అంటూ బండి సంజయ్‌ను ట్రోల్ చేస్తున్నారు. 

ALso REad:పెద్దలను గౌరవించడం మాకు అలవాటు.. చెప్పులందించడం గులామ్ గిరియా?: ట్రోలింగ్‌పై బండి సంజయ్ ఫైర్

ఈ వీడియోపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. గుజరాతీ గులాములను.. ఢిల్లీలో నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని తెలంగాణ సమాజం గమనిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం నిలపడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని చెప్పారు. 

‘‘ఢిల్లీ "చెప్పులు" మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న  నాయకున్ని -  తెలంగాణ  రాష్ట్రం గమనిస్తున్నది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నది. జై తెలంగాణ!’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

click me!