ఢిల్లీలోని లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరున్నందున ఆమె వెంటనే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ స్కామ్ తో తనకు సంబంధం లేదని కవిత ప్రకటించిన విసయం తెలిసిందే.
హైదరాబాద్: ఢిల్లీలోని లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరున్నందున వెంటనే ఆమె తన పదవికి రాజీనామా చేయాలని బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సోమవారం నాడు సాయంత్రం హైద్రాబాద్ బంజారాహిల్స్ లోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిని ముట్టడించేందుకు బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బీజేవైఎస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. బీజేపీకి చెందిన మహిళా విభాగం కార్యకర్తలు పెద్ద ఎత్తున కవిత ఇంటిని ముట్టడించేందుకు వచ్చారు. మహిళా పోలీసులు బీజేపీ మహిళా విభాగం కార్యకర్తలను అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అదే విధంగా బీజేవైఎం కార్యకర్తలను కూడా పోలీసులు కవిత ఇంటి వైపునకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులను తోసుకుంటూ కవిత ఇంటి వైపునకు వెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించిన క్రమంలో పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకొంది. దీంతో ఎమ్మెల్సీ కవిత ఇంటికి సమీపంలో ఉద్రిక్తత చోటు చేసుకొంది. పోలీసులను తోసుకుంటూ మహిళలు కవిత ఇంటి వైపునకు వెళ్లే ప్రయత్నం చేశారు. బీజేపీ మహిళా విభాగం కార్యకర్తలతో పాటు బీజేవైఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తనకు ఎలాంటి సంబంధం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సోమవారం నాడు మధ్యాహ్నం ప్రకటించారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేయనున్నట్టుగా ఆమె ప్రకటించారు.
undefined