హరీష్ అడ్డు తొలుగుతుంది, తెల్లారే కెటీఆర్ సీఎం: బండి సంజయ్ ప్రతి సవాల్

Siva Kodati |  
Published : Oct 31, 2020, 05:30 PM ISTUpdated : Oct 31, 2020, 05:52 PM IST
హరీష్ అడ్డు తొలుగుతుంది, తెల్లారే కెటీఆర్ సీఎం: బండి సంజయ్ ప్రతి సవాల్

సారాంశం

తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వలేదన్న సీఎం కేసీఆర్ విమర్శలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటరిచ్చారు. టీఆర్ఎస్ నేతలు పంచుతున్న ఓట్ల డబ్బులు ఎవరివని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వలేదన్న సీఎం కేసీఆర్ విమర్శలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటరిచ్చారు. టీఆర్ఎస్ నేతలు పంచుతున్న ఓట్ల డబ్బులు ఎవరివని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకుని బిజెపికి ఓటేయాలని ఆయన ప్రజలను కోరారు.

పింఛన్ల నిధుల లెక్కలపై కేసీఆర్ చెబుతున్నవన్ని అబద్ధాలేనని అంటూ కేంద్రం నిధులు ఇవ్వలేదని నిరూపిస్తే దుబ్బాక చౌరస్తాలో ఉరివేసుకుంటానని ప్రతి సవాల్ చేశారు సంజయ్. దుబ్బాకలో కేసీఆర్‌కు గెలవాలని లేదన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోతే హరీష్ రావు అడ్డు తొలగిపోతుందని, తెల్లారే కేటీఆర్ ను సీఎం చేస్తారని, అందుకే దబ్బాకలో టీఆర్ఎస్ గెలవాలని కేసీఆర్ కు లేదని సంజయ్ అననారు.దుబ్బాకలో టీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ సీఎం కారని ఆయన అన్నారు.

దుబ్బాకలో టీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బులు పంచుతోందని ఆరోపించారు బండి సంజయ్. టీఆర్ఎస్ పంచే డబ్బులు తీసుకుని బీజేపీకి ఓటేయ్యాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీకి ఓటు వేసి అధికార పార్టీకి షాక్ ఇవ్వాలని ఆయన కోరారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!