కోవిడ్ నిబంధనలు బ్రేక్: మంత్రి జగదీష్ రెడ్డిపై స్పీకర్ పోచారం ఆగ్రహం

By narsimha lodeFirst Published Sep 10, 2020, 1:05 PM IST
Highlights

కరోనా నిబంధనలను ఉల్లంఘించి అసెంబ్లీలో కూర్చొన్న మంత్రి జగదీష్ రెడ్డిపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


హైదరాబాద్: కరోనా నిబంధనలను ఉల్లంఘించి అసెంబ్లీలో కూర్చొన్న మంత్రి జగదీష్ రెడ్డిపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా నేపథ్యంలో పక్క పక్కనే మంత్రులు కూర్చోకుండా నో సీటింగ్ పేరుతో సీట్లను ఏర్పాటు చేశారు. ఒక్క సీటులో ఒక్కరే కూర్చొనేలా ఏర్పాట్లు చేశారు.నో సీటింగ్ అని రాసి ఉన్నా కూడ మంత్రి ఈటల రాజేందర్ పక్కనే మంత్రి జగదీష్ రెడ్డి కూర్చొన్నాడు.  నో సీటింగ్ అని రాసి ఉన్న స్థానంలో మంత్రి జగదీష్ రెడ్డి కూర్చోవడంపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించడంతో మంత్రి జగదీష్ రెడ్డి తన స్థానంలోకి వెళ్లి కూర్చొన్నారు. కరోనా నిబంధనలను పాటించాలని స్పీకర్ మరోసారి ప్రకటించారు.

కరోనా నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ముందు జాగ్రత్తలు తీసుకొన్నారు. కరోనా పరీక్షలు చేయించుకొని నెగిటివ్ ఉంటేనే  అసెంబ్లీకి అనుమతి ఇచ్చారు. అయితే అసెంబ్లీలోకి అనుమతి కోసం జారీ చేసే పాసుల విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగికి రెండు రోజుల క్రితం కరోనా నిర్ధారణ అయింది. దీంతో పాసులు తీసుకొన్నవారంతా భయాందోళనలకు గురౌతున్నారు. కరోనా సోకిన ఉద్యోగికి హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు.

 ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావుల మధ్య ఆసక్తికర సంభాషణ చోటచుచేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నిరంజన్‌రెడ్డి ఎక్కువ సమయం తీసకుంటున్నాడని  మంత్రులు ఈటెల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావులు ఆయన స్పీచ్‌కు అడ్డుపడ్డారు. 

ఒక్క ప్రశ్నకు నిరంజన్‌రెడ్డి ఎంత సమయం తీసుకుంటారని ఈటెల, ఎర్రబెల్లిలు ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారిద్దరు స్పీకర్‌కు సమయాన్ని గుర్తుచేశారు. ఇది గమనించిన స్పీకర్‌ పోచారం నిరంజన్‌రెడ్డిను ఉద్దేశించి తొందరగా ముగించాలని కోరారు. దీంతో నిరంజన్‌రెడ్డి ఒక్క నిమిషంలో తన స్పీచ్‌ను ముగించారు.

click me!