రూ. 40 లక్షల లంచం కేసు: తెరపైకి మాజీ కలెక్టర్ పాత్ర, ఏసీబీ విచారణ

By narsimha lodeFirst Published Sep 10, 2020, 12:04 PM IST
Highlights

రూ. 40 లక్షలు తీసుకొంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ కేసులో ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తోంది.

హైదరాబాద్: రూ. 40 లక్షలు తీసుకొంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ కేసులో ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తోంది.

మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ తో పాటు ఐదుగురిని బుధవారం నాడు సాయంత్రం ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో గురువారం నాడు ఉదయం నుండి ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

also read:రూ. 40 లక్షల లంచం: మెదక్ అడిషనల్ కలెక్టర్ సహా ఐదుగురి అరెస్ట్

ఈ కేసులో మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఏసీబీ అధికారుల విచారణలో కీలక విషయాలను చెప్పినట్టుగా సమాచారం. నర్సాపూర్ ల్యాండ్ కేసులో మాజీ కలెక్టర్ కు కూడ వాటా ఇవ్వాలని బాధితుడిని అడిషనల్ కలెక్టర్ డబ్బులు డిమాండ్ చేశారు.

బాధితుడితో అడిషనల్ కలెక్టర్ ఫోన్ లో మాట్లాడిన ఆడియో సంభాషణలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ ఆడియో సంభాషణల అధారంగా ఏసీబీ అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. 

112 ఎకరాల భూమికి ఎన్ఓసీ కోసం రూ. 1.12 కోట్లు లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే బుధవారం నాడు రూ. 40 లక్షలు లంచం తీసుకొంటూ ఏసీబీకి  అడిషనల్ కలెక్టర్ నగేష్ చిక్కాడు.

ఈ కేసుతో సంబంధం ఉన్న ఆర్డీఓ, తహాసీల్దార్, అడిషనల్ కలెక్టర్ జీవన్ గౌడ్, జూనియర్ అసిస్టెంట్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.బుధవారం నాడు సుమారు 8 గంటలకు పైగా ఈ ఐదుగురి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. గురువారం నాడు కూడ సోదాలు కొనసాగుతున్నాయి.

నర్సాపూర్ ల్యాండ్ కేసులో మెదక్ మాజీ కలెక్టర్ పేరును విచారణ సందర్భంగా నగేష్ వెల్లడించినట్టుగా సమాచారం.నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం కలెక్టర్ తో సంతకం చేయిస్తానని అడిషనల్ కలెక్టర్ బాధితుడితో ఫోన్ లో సంభాషించినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. 

ఈ విషయమై ఏసీబీ అధికారులు నగేష్ ను ప్రశ్నించారు. మాజీ కలెక్టర్ పాత్ర విషయంలో కూడ ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.మాజీ జిల్లా కలెక్టర్ పేరును అడిషనల్ కలెక్టర్ ఉపయోగించుకొన్నాడా...ఆయన పాత్ర కూడ ఏమైనా ఉందా అనే కోణంలో కూడ ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

దాదాపు 30 గంటల పాటు ఏసీబీ అధికారులు మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. . పక్కా ఆధారాలు సేకరించాక అదనపు కలెక్టర్ నగేష్‌ను అరెస్ట్ చేశారు. నగేష్‌ను మాచవరం నుండి అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు. 

అదనపు కలెక్టర్‌ నగేష్‌దినిజామాబాద్‌ జిల్లా..  గ్రూప్‌ -2 ద్వారా సెక్రటేరియట్‌ సర్వీసుకు ఎంపికయ్యారు. సెక్రటేరియట్‌లో ఏఎస్ఓ, ఎస్‌వోగా పనిచేసి డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. 

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని కామారెడ్డిలో గతంలో ఆర్‌డీవోగా పనిచేశారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత జగిత్యాల డీఆర్‌వోగా బదిలీపై వెళ్లారు. తర్వాత మెదక్‌కు అదనపు కలెక్టర్‌గా వెళ్లారు. మరో సంవత్సరంలో కన్‌ఫర్డ్డ్‌ హోదాలో ఐఏఎస్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆయన ఏసీబీకి పట్టుబడ్డారు.

అరెస్ట్ చేసి ఐదుగురు నిందితులను  వైద్య పరీక్షలు నిర్వహించి ఇవాళ ఏసీబీ కోర్ట్ లో ప్రవేశ పెట్టనుంది ఏసీబీ.నగేష్ ఇంట్లో అగ్రిమెంట్ సేల్ డాక్యుమెంట్స్, చెక్స్ స్వాధీనం చేసుకొన్న ఏసీబీ అధికారులు.ఆడియో టేపులతో సహా రెడ్ హ్యాండెడ్ గా నగేష్ ను ఏసీబీ అధికారులు పట్టుకొన్నారు.


 

click me!