నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

By Mahesh KFirst Published Sep 6, 2022, 3:55 AM IST
Highlights

నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం అవుతాయి. ఉభయ సభలూ 11.30 మొదలవుతాయి. అనంతరం, ఈ రెండు సమావేశాలు 12వ తేదీకి వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి.
 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన సభ, శాసన మండలి సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఈ రెండు సభలు వేర్వేరుగా ప్రారంభం అవుతాయి. శాసన సభలో ఇటీవలే మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలియజేస్తూ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటన చేస్తారు. మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్దన్ రెడ్డికి సంతాపం ప్రకటించనున్నారు. ఈ ప్రకటన తర్వాత సభను ఈ నెల 12వ తేదీ వాయిదా వేసే అవకాశం ఉన్నది.

శాసన సభ వాయిదా వేసిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం కానుంది. ఈ భేటీలోనే అసెంబ్లీ సమావేశాల అజెండా, సభ నిర్వహణ తేదీలను ఖరారు చేయనున్నట్టు తెలుస్తున్నది. 

వినాయక నిమజ్జనం తేదీలను గుర్తు పెట్టుకుని అందుకు అనుగుణంగా సభా సమావేశాలను నిర్ణయించే  అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. బీఏసీలో సమావేశంలో వచ్చే సూచనలు, సలహాల ఆధారంగా ఈ నెలలో మూడురోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే  అవకాశాలు ఉన్నాయి. అంటే.. నిమజ్జనం తర్వాత 12వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నది.

కాగా, శాసన మండలి కూడా నేడు ప్రారంభమై 12వ తేదీకి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. చైర్మన్గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11.30 గంటలకు మండలి సమావేశం ప్రారంభం కానుంది. అనంరం, ‘వారు గోదావరి పరీవాహక ప్రాంతంలో వరద ముప్పు’ అంశంపై చిన్నపాటి చర్చ చేసే అవకాశం ఉన్నది. ఆ తర్వాత శాసన మండలిని కూడా 12వ తేదీకే వాయిదా వేసే అవకాశాలు
ఎక్కువ ఉన్నాయి.

అయితే రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది. బీజేపీ శాసనసభపక్షనేత రాజాసింగ్ పై పీడీయాక్ట్ ను నమోదు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. రాజాసింగ్ ను అసెంబ్లీ నుండి బహిష్కరించాలని ఎంఐఎం ఇప్పటికే డిమాండ్ చేసింది.ఈ విషయమై కూడా చర్చించే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసెంబ్లీ వేదికగా బీజేపీ తీరును టీఆర్ఎస్ ఎండగట్టనుంది. 

click me!