
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషీతో అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు మంగళవారం నాడు సమావేశమయ్యారు.
అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు సీఎస్ ఎస్ కే జోషీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహదారుడు రాజీవ్ శర్మ, సీఎంఓ ప్రిన్సిఫల్ సెక్రటరీ నరసింగరావు కూడ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది. గత మాసంలోనే ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ ను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ కలిశారు.
దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. మరో వైపు అసెంబ్లీని రద్దు చేయకపోతే ప్రతి ఆరు మాసాలకు ఓసారి అసెంబ్లీని సమావేశపర్చాల్సి ఉటుంది. దీంతో ఈ మాసంలో ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది.
ఒకవేళ అసెంబ్లీని రద్దు చేస్తే అసెంబ్లీని సమావేశపర్చాల్సిన అవసరం మాత్రం లేదు. ఇవాల సచివాలయంలో అసెంబ్లీ సెక్రటరీ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీతో పాటు ఇతర ముఖ్యులతో సెక్రటేరియట్‌లో మంగళవారం నాడు సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
మరో వైపు రెండు మూడు రోజుల్లో మరో కేబినెట్ సమావేశం జరగనుంది. అంతేకాదు సెప్టెంబర్ 7వ తేదీ నుండి హుస్నాబాద్ నుండి తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.
ఈ వార్త చదవండి
ముందస్తు సంకేతాలు: హుస్నాబాద్ నుండి కేసీఆర్ ఎన్నికల ప్రచారం