ప్రజా యుద్ధనౌక గద్ధర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఘన నివాళి

Siva Kodati |  
Published : Aug 06, 2023, 07:02 PM IST
ప్రజా యుద్ధనౌక గద్ధర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఘన నివాళి

సారాంశం

ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్ధర్‌ మృతి పట్ల తెలంగాణ శాసనసభ సంతాపం తెలిపింది.  ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, తలసాని తదితరులు గద్ధర్‌‌కు నివాళులర్పించారు. 

ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్ధర్‌ మృతి పట్ల తెలంగాణ శాసనసభ సంతాపం తెలిపింది. బడుగు బలహీన వర్గాల కోసం గద్ధర్ పోరాడారని .. తన ఆట పాటలతో అందరినీ కదిలించారని అసెంబ్లీ ప్రశంసించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో తన గళంతో కోట్లాది మందిని చైతన్యపరిచిన గద్ధర్ మృతి తీరని లోటన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, తలసాని తదితరులు గద్ధర్‌‌కు నివాళులర్పించారు. 

కాగా.. గద్దర్‌గా సుపరిచితుడైన ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో ఆయన జన్మించారు. తల్లి పేరు లచ్చమ్మ, తండ్రిపేరు శేషయ్య. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. ఉద్య‌మ‌కారుడిగా, గాయ‌కుడిగా ఆయ‌న తెలంగాణ స‌మాజంపై చెర‌గ‌ని ముద్రవేశారు. ముఖ్యంగా ఆయన రాసిన పాటులు ప్రజా చైతన్య ధివిటీలుగా వెలిగాయి.

ALso Read: గద్ధర్ మరణానికి కారణమిదే .. అపోలో వైద్యులు ఏమన్నారంటే, హెల్త్ బులెటిన్ ఇదే

యువ ఉద్యమకారులు నరనరాన నిండి ఉత్సాహాన్ని ఉరకలు వేసేలా చేశాయి. ప్రజా గాయకుడిగా బయట స్టేజ్ ల మీద పెర్ఫామ్ చేస్తూ.. ఇటు ఉద్యమ సినిమాలకు కూడా ఆయన పాటలు రాశారు.  సినిమాల్లో ఉద్యమ పాటల ద్వారా ఆయన ప్రజలకు ఇంకా త్వరగా చేరువయ్యారు. మరీ ముఖ్యంగా దాసరి నారాయణ రావు.. ఆర్ నారాయణమూర్తి సినిమాలకు గద్దర్ ఎక్కువగా పాటలు రాశారు. 

1979 లో మా భూమి  సినిమాలో గద్దర్ రాసి బండెనక బండి కట్టి పాటను వాడారు. నిజానికిరజాకార్ల ఉద్యమం కోసంవిప్లవ గీతంగా గద్దర్ రాసి పాడిన ఆ పాటల.. జన హృదయాలను గెలిచింది. యువతను ఉర్రూతలూగించింది. ఇన్నేళ్ళు అవుతున్న ఇంకా ఇప్పటికీ బండెనక బండి కట్టీ.. అంటూ పాట  వినిపిస్తూ ఉంది అంటే.. గద్దర్ రచన.. ఆయన గాత్రం.. భావం ఎంతలా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందో అర్ధం అవుతుంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu