జనగామ సీటును తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ కు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో పొన్నాలకు టికెట్ ఇవ్వడం లేదని అంటున్నారు. ఆ కారణంగానే ఆయన పేరు తొలి జాబితాలో లేదని సమాచారం.
వరంగల్: తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కంగు తిన్నట్లే కనిపిస్తున్నారు. తన సీటును పెండింగులో పెట్టడంపై ఆయన తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన కాంగ్రెసు అధిష్టానం పెద్దలను కలుసుకునేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
జనగామ సీటును తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ కు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో పొన్నాలకు టికెట్ ఇవ్వడం లేదని అంటున్నారు. ఆ కారణంగానే ఆయన పేరు తొలి జాబితాలో లేదని సమాచారం.
జనగామ నుంచి పోటీ చేయాలనే పట్టుదలతో పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు. అయితే, అధిష్టానం ఆలోచన మరో విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పొన్నాలను లోకసభకు పోటీ చేయించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.
పొన్నాల తెలంగాణ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ కుంతియాను కలిసే అవకాశం ఉంది. అయితే, ఢిల్లీకి ఎవరూ రావద్దని అధిష్టానం కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో విజయ రామారావుకు కూడా టికెట్ లభించలేదు. స్టేషన్ ఘనపూర్ సీటును ఆయన ఆశించారు. అయితే, ఆ సీటును ఇందిరకు కేటాయించారు. గండ్ర వెంకటరమణా రెడ్డి పేరు కూడా తొలి జాబితాలో లేదు. ఆయన భూపాలపల్లి సీటును ఆశిస్తున్నారు.
సంబంధిత వార్తలు
పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్
కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య