పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

By pratap reddy  |  First Published Nov 13, 2018, 12:15 AM IST

పొన్నాల లక్ష్మయ్యను లోకసభ ఎన్నికల్లో పోటీకి దింపే ఆలోచన ఉన్నట్లు కూడా చెబుతున్నారు. అయితే, తనకు సీటు దక్కదనే సంకేతాలు అందడంతో ఇటీవల పొన్నాల కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే.


న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ సోమవారం రాత్రి విడుదల చేసిన తొలి జాబితాలో పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పేరు లేదు. ఆయన జనగామ టికెట్ ఆశిస్తున్న విషయం తెలిసిందే. ఆ సీటు నుంచి తెలంగాణ జన సమితి (టీజెఎస్) అధ్యక్షుడు కోదండరామ్ ను పోటీకి దింపాలని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పొన్నాల లక్ష్మయ్య పేరు ప్రకటించలేదని సమాచారం.

పొన్నాల లక్ష్మయ్యను లోకసభ ఎన్నికల్లో పోటీకి దింపే ఆలోచన ఉన్నట్లు కూడా చెబుతున్నారు. అయితే, తనకు సీటు దక్కదనే సంకేతాలు అందడంతో ఇటీవల పొన్నాల కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే.

Latest Videos

కాగా, నక్రేకల్ సీటును తెలంగాణ ఇంటి పార్టీకి కేటాయిస్తారని భావిస్తూ వచ్చారు. అయితే, ఆ సీటును కోమటిరెడ్డి వెంకటరెడ్డి సన్నిహితుడు చిరుమర్తి లింగయ్యకే కేటాయించారు. చిరుమర్తి లింగయ్యకు నక్రేకల్ సీటు ఇవ్వకపోతే తాను కూడా పోటీ నుంచి విరమించుకుంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే చిరుమర్తి లింగయ్యకు సీటు కేటాయించినట్లు చెబుతున్నారు. 

ఇక, సూర్యాపేట సీటు రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన పటేల్ రమేష్ రెడ్డికి కాకుండా ఆర్ దామోదర్ రెడ్డికి కేటాయించారు. తెలంగాణ రాష్ట్రసమితి నుంచి వచ్చిన కొండా సూరేఖకు పరకాల సీటు కేటాయించారు. 

తొలి జాబితాలో ముగ్గురు మాజీ పార్లమెంటు సభ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలు సీట్లు దక్కించుకున్నారు. మల్లు బట్టి విక్రమార్కతో పాటు మల్లు రవికి కూడా సీట్లు దక్కాయి. 

సంబంధిత వార్త

ఉత్తమ్ తో పాటు భార్యకూ టికెట్: కాంగ్రెసు తొలి జాబితా, అభ్యర్థులు వీరే

click me!