Election Commission: కొత్త ఓటుహక్కుకు ముగిసిన దరఖాస్తు గడువు.. ఎంత మంది ఆప్లై చేసుకున్నారంటే..? 

Published : Nov 02, 2023, 11:37 AM IST
Election Commission: కొత్త ఓటుహక్కుకు ముగిసిన దరఖాస్తు గడువు.. ఎంత మంది ఆప్లై చేసుకున్నారంటే..? 

సారాంశం

Election Commission: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో  ఈ నెలలో వివిధ దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. ప్రధానంగా కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తులు స్వీకరించింది. అయితే.. ఈ గడవు అక్టోబర్ 31 న ముగిసింది. ఇంతకీ కొత్త ఎంత మంది ఓటు హక్కు కోసం ఎంత మంది ఆప్లై చేసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారంటే..? 

Election Commission: ఎన్నికలు అంటేనే ఓటర్ల పండుగ. ఈ పండుగ వచ్చిందంటే చాలు .. ఎన్నికల బరిలో ఉన్న రాజకీయ నాయకులంతా ఓటరు మహాశయులను ప్రత్యేక్షం చేసుకోవడానికి నానా ప్రయత్నాలు పడుతుంటున్నారు. ఓటు కోసం కొండ మీద కోతినైనా తెచ్చి ఇవ్వడానికి వెనుకాడారు. అసలు ఏ విషయంలో కూడా తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తారు. నాయకులు ఇంత కష్టపడటానికి, నేతలు ఇన్ని వేశాలు వేయడానికి కారణం.. ఓటరు దగ్గర ఓ వజ్రాయుధం ఉంది. ఆ ఆయుధమే ఓటు హక్కు.  

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి.  ఈ క్రమంలో తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసి..  ఎలక్షన్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తులు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన అక్టోబర్‌ 9 నుంచి 31వ తేదీ వరకు స్వీకరించారు. ఈ ఆవకాశం అక్టోబరు 31తో ముగిసింది.

ఈ నేపథ్యంలో కొత్తగా ఓటు హక్కు కోసం దాదాపు 10.42 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. నూతన దరఖాస్తుల పరిశీలన తరువాత ఈ నెల 10 వరకు నూతన జాబితాను సిద్దం చేయనున్నట్టు ఈసీ ప్రకటించింది. ఇటీవల గణాంకాల ప్రకారం..  తెలంగాణలో మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. తాజాగా ఓటు హక్కు కోసం 10.42 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!