కమ్యూనిష్టులతో పొత్తులుంటాయి: తేల్చేసిన మాణిక్ రావు ఠాక్రే


కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తుల విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది.   ఇవాళ మధ్యాహ్నం వరకు సీపీఎం కాంగ్రెస్ కు డెడ్ లైన్ విధించింది.  కాంగ్రెస్ తీరుపై  సీపీఐ కూడ అసంతృప్తితో ఉంది.  ఈ తరుణంలో  లెఫ్ట్ , కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందా లేదా అనే చర్చ సాగుతుంది. 



హైదరాబాద్: కమ్యూనిష్టు పార్టీలతో పొత్తులుంటాయని  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే తేల్చి చెప్పారు.బుధవారంనాడు  కాంగ్రెస్ పార్టీ నేత ఠాక్రే ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తేల్చి చెప్పారు.

లెఫ్ట్ పార్టీలతో పొత్తు చర్చలు కొనసాగుతున్నాయన్నారు.  కమ్యూనిష్టులది, తమ పార్టీ ఒకే రకమైన అభిప్రాయంతో ఉన్నారు. చెన్నూరులో తమకు బలమైన  అభ్యర్ధి వచ్చారన్నారు.   కమ్యూనిష్టులకు  ఏ సీట్లు కేటాయించాలనే దానిపై  చర్చలు జరుపుతున్నామన్నారు.   లెఫ్ట్ పార్టీలతో  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, వంశీ చంద్ రెడ్డిలు చర్చించనున్నారని  మాణిక్ రావు ఠాక్రే చెప్పారు.  మరో వైపు  ఇవాళ కెఎల్ఆర్ ఇంట్లో  ఐటీ దాడుల వెనుక బీజేపీ హస్తం ఉందని  ఆయన ఆరోపించారు.

Latest Videos

తెలంగాణలో లెఫ్ట్ పార్టీలతో  పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.  సీపీఐ, సీపీఎంలకు  రెండేసీ స్థానాలను కేటాయించాలని కాంగ్రెస్ డిసైడ్ చేసింది.  కొత్తగూడెం, చెన్నూరు స్థానాలను  సీపీఐకి,  మిర్యాలగూడతో పాటు మరో అసెంబ్లీ స్థానాన్ని సీపీఎంకు  కేటాయించాలని  కాంగ్రెస్ భావించింది. అయితే ఈ విషయమై  కాంగ్రెస్ పార్టీ నుండి  అధికారికంగా  స్పష్టత రావాల్సి ఉంది.ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరికలు కూడ లెఫ్ట్ పార్టీలకు కేటాయించాల్సిన సీట్లపై ప్రభావం చూపే అవకాశాలు చూపనున్నాయి. ఈ తరుణంలో లెఫ్ట్ పార్టీల నేతలు  అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని సీపీఎం  రాష్ట్ర నాయకత్వం  ఇవాళ  మధ్యాహ్ననికి డెడ్ లైన్  విధించింది.

also read:నేడు మధ్యాహ్నం వరకు కాంగ్రెస్‌కు సీపీఎం డెడ్ లైన్: స్పందించకపోతే ఒంటరిగానే బరిలోకి

నిన్న సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. కాంగ్రెస్ తో పొత్తు కుదరకపోతే  సీపీఐతో కలిసి పోటీ చేసేందుకు  అవసరమైన  ప్లాన్ ను సీపీఎం సిద్దం చేసింది. ఈ విషయమై నిన్నటి సమావేశంలో సీపీఎం చర్చించింది. ఇవాళ మధ్యాహ్నం వరకు  తమకు సమయం ఇవ్వాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరడంతో  మధ్యాహ్నం వరకు  వేచి చూడాలని సీపీఎం భావిస్తుంది. అప్పటివరకు  కాంగ్రెస్ తేల్చకపోతే  20 నుండి 22 స్థానాల్లో పోటీ చేయాలని  సీపీఎం భావిస్తుంది. సీపీఐతో  కలిసి పోటీ చేయాలని సీపీఎం నిర్ణయం తీసుకుంది.

కాంగ్రెస్ తీరుపై సీపీఐ కూడ  అసంతృప్తితోనే ఉంది. తమకు కేటాయిస్తామన్న సీట్ల విషయంలో మార్పులు చేర్పుల గురించి కాంగ్రెస్ నుండి సమాచారం రాలేదని  సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు  నిన్న ప్రకటించారు.  


 

click me!