Telangana assembly elections 2023: బిఆర్ఎస్ టికెట్లు దక్కని సిట్టింగులు వీరే?

Published : Aug 18, 2023, 11:47 AM IST
Telangana assembly elections 2023: బిఆర్ఎస్ టికెట్లు దక్కని సిట్టింగులు వీరే?

సారాంశం

వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దాదాపు 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వారి జాబితాను చూడండి

హైదరాబాద్: వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దాదాపు 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్లు దక్కని బిఆర్ఎస్ ఎమ్మెల్యేల జాబితా ఒక్కటి ప్రచారంలోకి వచ్చింది. సర్వేల ఆధారంగా కేసిఆర్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు.  ఈ నెల 21వ తేదీన కేసిఆర్ 80, 90 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేస్తారని అంటున్నారు. 

ఈ కింది శాసనసభ్యులకు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ టికెట్లు రావనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలవారీగా వారి జాబితా ఈ కింద చూడవచ్చు.

1. ఆదిలాబాద్ - రేఖానాయక్ (ఖానాపూర్), దుర్గం చిన్నయ్య (బెల్లంపల్లి)
2. కరీంనగర్ - సుంకే రవిశంకర్ (చొప్పదండి), సిహెచ్ రమేష్ (వేములవాడ), పుట్ట మధు) (మంథని), కోరుకంటి చందర్ (రామగుండం), డాక్టర్ సంజయ్ (జగిత్యాల)
3. మెదక్ - చిలుముల మదన్ రెడ్డి (నర్సాపూర్), కె. మాణిక్ రావు (జహీరాబాద్)
4. రంగారెడ్డి - బేతి సుభాష్ రెడ్డి (ఉప్పల్)
5. హైదరాబాద్ - కాలేరు వెంకటేష్ (అంబర్ పేట), ముఠా గోపాల్ (ముషీరాబాద్)
6. మహబూబ్ నగర్ - జైపాల్ యాదవ్ (కల్వకుర్తి)
7. నల్లగొండ - నోముల భగత్ (నాగార్జునసాగర్), బొల్లం మల్లయ్య యాదవ్ (కోదాడ), కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (మునుగోడు)
8. వరంగల్ - తాడికొండ రాజయ్య (స్టేషన్ ఘనపూర్), ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (జనగాం), నన్నపునేనే నరేందర్ (వరంగల్ తూర్పు)
9. ఖమ్మం - రాములు నాయక్ (వైరా), హరిప్రియ నాయక్ (ఇల్లందు)

స్టేషన్ ఘనపూర్ లో తాటికొండ రాజయ్య స్థానంలో సీనియర్ నేత కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. తాటికొండ రాజయ్యపై సర్పంచు నవ్య చేసిన ఆరోపణల నేపథ్యంలో కెసిఆర్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, తాటికొండ రాజయ్య ఎప్పటికప్పుడు వివాదాలను ఆహ్వానిస్తున్నారు. కడియం శ్రీహరితో ఆయనకు ఏ మాత్రం పొసగడం లేదు.

జనగాంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి తప్పించి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై భుకబ్జాలకు చెందిన ఆరోపణలు చాలా ఉన్నాయి. స్వయంగా ఆయన కూతురే తీవ్రమైన ఆరోపణలు చేశారు. వేములవాడలో రమేష్ ను పక్కన పెట్టి లక్ష్మీకాంతరావును పోటీకి దించే అవకాశం ఉంది. రమేష్ పౌరసత్వం వివాదంలో చిక్కుకున్నారు. 

నర్సాపూర్ లో సునీతా లక్ష్మారెడ్డిని బిఆర్ఎస్ తరఫున పోటీకి దించే అవకాశాలున్నాయి. ఉప్పల్ టికెట్ బండారి లక్ష్మారెడ్డికి ఇవ్వవచ్చు. వైరాలో బానోత్ మదన్ లాల్ ను పోటీకి దించే ఆలోచనలో కేసిఆర్ ఉన్నార. ఇల్లందులో మాజీ శాసనసభ్యుడు గుమ్మడి నర్సయ్య కూతురు అనురాధ బిఆర్ఎస్ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్