Goshamahal constituency: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నాయకుడు టీ రాజాసింగ్ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి సవాలు విసిరారు. దమ్ముంటే గోషామహల్ నియోజకవర్గంలో ఎంఐఎం తమ అభ్యర్థిని నిలబెట్టాలని సవాలు విసిరారు. ఇదే క్రమంలో తమ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తామని బెదిరించి రాజకీయ పార్టీల నుంచి డబ్బులు తీసుకుంటున్నారని కూడా ఆరోపించారు.
Goshamahal MLA T Raja Singh: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నాయకుడు టీ రాజాసింగ్ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి సవాలు విసిరారు. దమ్ముంటే గోషామహల్ నియోజకవర్గంలో ఎంఐఎం తమ అభ్యర్థిని నిలబెట్టాలని సవాలు విసిరారు. ఇదే క్రమంలో తమ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తామని బెదిరించి రాజకీయ పార్టీల నుంచి డబ్బులు తీసుకుంటున్నారని కూడా ఆరోపించారు.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనీ, లేదంటే తన సోదరుడు అసదుద్దీన్ ను అక్కడి నుంచి బరిలోకి దింపాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. "అసదుద్దీన్ లేదా ఆయన సోదరుడు లేదా ఎంఐఎం నుంచి మరొకరు ఇక్కడి (గోషామహల్) నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలి. బీఆర్ఎస్ కు లబ్ది కలిగించేందుకు ఇక్కడ పోటీ చేయడం లేయరు' అని బుధవారం అన్నారు.
undefined
ఎంఐఎం నేతపై విమర్శలతో విరుచుకుపడిన రాజాసింగ్.. . 'మీరు (ఒవైసీ) డబ్బులు తీసుకుని గోషామహల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిని సిఫారసు చేయండి. మీ పార్టీ ప్రధాన కార్యాలయం దారుస్సలాం గోషామహల్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చినా ఎంఐఎం నుంచి ఎవరినీ బరిలోకి దింపడం లేదు. గోషామహల్ లో అధికార పార్టీ అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడానికి అసదుద్దీన్ కారణమనీ, ఆయనకు రావాల్సిన బ్యాగులు వస్తే వారి పేరును ప్రగతి భవన్ కు పంపుతారంటూ ఆరోపించారు.
గోషామహల్ నియోజకవర్గం నుంచి వారి పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదని అసదుద్దీన్ ఒవైసీని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించిన క్రమంలోనే రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసదుద్దీన్ ను టార్గెట్ చేసిన రాజాసింగ్.. కొత్త ప్రాంతాల నుంచి పోటీ చేసినా గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంలో విఫలమవుతున్నారన్నారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఒక్క ఓటు కూడా రాదని అన్నారు. అలాగే, అసదుద్దీన్ ఓవైసీ తన వ్యాపారాన్ని విస్తరించడం, డబ్బు సంపాదించడంలో బిజీగా ఉన్నారని రాజాసింగ్ విమర్శించారు. ఆయా ప్రాంతాల నుంచి పోటీ చేస్తామని చెప్పి దేశంలోని వివిధ రాజకీయ పార్టీలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.