తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే బిఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను కేసిఆర్ సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ జాబితా ఇదేనంటూ సోషల్ మీడియాలో పేర్తు చక్కర్లు కొడుతున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 50 నుంచి 80 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆయన ఈ నెల 21వ తేదీన విడుదల చేస్తారని చెబుతున్నారు. ఆ అభ్యర్థులు వీరేనంటూ సోషల్ మీడియాలో లిస్ట్ ఒక్కటి చక్కర్లు కొడుతోంది. ఈ జాబితాను ఎవరు బయటపెట్టారనేది తెలియడం లేదు. కానీ, అది మాత్రం వేగంగా సోషల్ మీడియాలో తిరుగుతోంది.
మెజారిటీ శాసనసభ్యులకు బిఆర్ఎస్ టికెట్లు లభిస్తున్నట్లు ఆ జాబితాను పరిశీలిస్తే అర్థమవుతోంది. జనగామ నుంచి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి తిరిగి టికెట్ లభించే అవకాశాలు లేవని సమాచారం. ఆయన స్థానంలో పల్లా రాజేశ్వర రెడ్డిని పోటీకి దించుతారని తెలుస్తోంది. అలాగే, స్టేషన్ ఘనపూర్ స్థానం నుంచి ప్రస్తుత శాసనసభ్యుడు తాటికొండ రాజయ్యకు స్థానం దక్కే అవకాశం లేదు. ఆయన స్థానంలో సీనియర్ నాయకుడు కడియం శ్రీహరిని పోటీకి దించుతారని సమాచారం. ముఖ్యమంత్రి కేసిఆర్ తిరిగి గజ్వేల్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.