కేసీఆర్ కు కొత్త టెన్షన్.. గజ్వేల్ లో 154, కామారెడ్డిలో 104 నామినేషన్లు.. రెబ‌ల్స్ పోరును త‌ట్టుకునేనా..?

By Mahesh Rajamoni  |  First Published Nov 14, 2023, 5:34 AM IST

KCR: 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌ నుంచి కేసీఆర్‌ విజయం సాధించారు. 2014లో 19,391 ఓట్ల తేడాతో 44.06% షేర్ తో గెలుపొందారు. 2018లో 1.25 లక్షల ఓట్లు లేదా 60.45% ఓట్ షేర్‌ను సాధించారు. తన సమీప ప్రత్యర్థిని 58,000 కంటే ఎక్కువ ఓట్లతో ఓడించారు. ఈ సారి కేసీఆర్ కు అంత తేలిక‌గా విజ‌యం ద‌క్క‌ద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
 


New Tension For KCR: అధికార పార్టీ భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధినేత‌, ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) కు కొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుందని తెలుస్తోంది. ముచ్చ‌ట‌గా మూడో సారి అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని చూస్తున్న బీఆర్ఎస్ కు రెబ‌ల్స్ బెడ‌ద ప‌ట్టుకుంది. ఏకంగా సీఎం కేసీఆర్ కు టెన్ష‌న్ పెడుతున్నారు. కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజక వర్గంలో ఆయనకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నామినేషన్లు దాఖలవ్వడంతో కొత్త టెన్షన్ నెలకొంది. గజ్వేల్‌లో 154 నామినేషన్లు దాఖలు అయ్యాయి. దీంతో గజ్వేల్‌లో నామినేషన్‌ వేయడంతో బీఆర్‌ఎస్‌ కొత్త టెన్షన్‌ను ఎదుర్కొంది. ఇప్పుడు వారి కాన్సంట్రేషన్ మొత్తం నామినేషన్లపైనే ఉంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. నామినేషన్ల పరిశీలన జరగనుంది.. ఉప‌సంహ‌ర‌ణ‌కు టైమ్ ఉంది. పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా దాఖలైన నామినేషన్లపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. సీఎం కేసీఆర్ నామినేషన్ వేసిన బాధితులను నేతలు శాంతింపజేస్తున్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రాగానే తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. నామినేషన్లలో రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లి ప్లాట్ల బాధితులు, రైతులు 100 మందికి పైగా ఉన్నారు.

Latest Videos

రాష్ట్రంలో చెరుకు ఫ్యాక్టరీలను తెరిపించాలని రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల తరపున 30కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన బీఆర్ఎస్ పార్టీ నేతలు వారిని వెనక్కి తగ్గేలా బుజ్జగిస్తున్నారు. ఈ క్రమంలో గజ్వేల్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ రెబ‌ల్స్ ను, బాధిత రైతులు, నిరుద్యోగుల పోరును త‌ట్టుకుని నిల‌బ‌డుతుందో లేదో చూడాలి. కాగా, ఇప్ప‌టికే తెలంగాణలో నామినేషన్ల దాఖలుకు సీఈవో కార్యాలయం ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెగ్మెంట్లలో మొత్తం 4,798 మంది అభ్యర్థులు 5,716 నామినేషన్లు దాఖలు చేశారు. గజ్వేల్‌లో 145 మంది అభ్యర్థులు 154 నామినేషన్లు దాఖలు చేశారు. 92 మంది 116 నామినేషన్లతో మేడ్చల్ రెండో స్థానంలో, కామారెడ్డిలో 104 నామినేషన్లు, అత్యల్పంగా నారాయణపేటలో 13 నామినేషన్లు, వైరా, మక్తల్‌లో 13 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి.

click me!