నేడు మధ్యాహ్నం వరకు కాంగ్రెస్‌కు సీపీఎం డెడ్ లైన్: స్పందించకపోతే ఒంటరిగానే బరిలోకి

By narsimha lode  |  First Published Nov 2, 2023, 10:10 AM IST

కాంగ్రెస్ తో లెఫ్ట్ పార్టీల మధ్య  పొత్తు విషయమై  ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. పొత్తు విషయంలో  కాంగ్రెస్ పార్టీ  వైఖరిపై  లెఫ్ట్ పార్టీల నేతలు అసంతృప్తిగా ఉన్నారు.  కాంగ్రెస్ తో తాడో పేడో తేల్చుకోవాలనే అభిప్రాయంతో ఉన్నారు.
 


హైదరాబాద్: సీట్ల సర్ధుబాటుపై గురువారం మధ్యాహ్నం వరకు  కాంగ్రెస్ కు సీపీఎం డెడ్ లైన్ విధించింది. అప్పటి వరకు  కాంగ్రెస్ నుండి స్పష్టత రాకపోతే  ఒంటరిగా పోటీ చేయాలని  సీపీఎం భావిస్తుంది. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో   సీపీఐ, సీపీఎంతో  కాంగ్రెస్ పొత్తు చర్చలు జరుపుతుంది. ఈ రెండు పార్టీలకు  నాలుగు అసెంబ్లీ  స్థానాలను కేటాయించాలని  కాంగ్రెస్ ప్రతిపాదించింది. సీట్ల కేటాయింపు విషయంలో  కాంగ్రెస్ తీరుపై  సీపీఎం  తీవ్ర అసంతృప్తితో ఉంది.  మిర్యాలగూడ, వైరా అసెంబ్లీ సీట్ల కేటాయింపు విషయమై  కాంగ్రెస్ నుండి స్పష్టమైన హామీ రాకపోతే  ఒంటరిగా పోటీ చేయాలని సీపీఎం భావిస్తుంది.  ఇవాళ  మధ్యాహ్నం వరకు ఈ విషయమై  కాంగ్రెస్ వైఖరి  కోసం  సీపీఎం ఎదురు చూస్తుంది.

Latest Videos

undefined

మిర్యాలగూడ, వైరా అసెంబ్లీ స్థానాలను  తమకు కేటాయించకపోతే  పొత్తు అవసరం లేదనే అభిప్రాయంతో సీపీఎం ఉంది.  నిన్న సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కాంగ్రెస్ తో పొత్తు విషయమై చర్చించారు. అంతకుముందు  రోజు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో  ఈ విషయమై  చర్చించారు.  రాష్ట్ర కార్యదర్శివర్గంలో తీసుకున్న నిర్ణయాలను నిన్న రాష్ట్ర కమిటీ సమావేశంలో ప్రస్తావించారు.

ఈ పరిణామాలతో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో  నిన్న ఫోన్ లో మాట్లాడారు. దీంతో  ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల వరకు  ఎదురు చూస్తామని  మల్లు భట్టి విక్రమార్కకు  తమ్మినేని వీరభద్రం తేల్చి చెప్పారు.  

కాంగ్రెస్ తో పొత్తు లేకపోతే  సీపీఐతో కలిసి  పోటీ చేయాలని  సీపీఎం  భావిస్తుంది.  సుమారు  22 స్థానాల్లో పోటీకి సీపీఎం రంగం సిద్దం చేసుకుంది.  ఉమ్మడి నల్గొండ, ఖమ్మం,  రంగారెడ్డి  జిల్లాల్లోని  22 స్థానాల్లో పోటీ చేయాలని సీపీఎం  నిర్ణయం తీసుకుంది.  ఈ మేరకు  అసెంబ్లీ స్థానాలు,  అభ్యర్ధులను కూడ ఆ పార్టీ ఫైనల్ చేసింది. కాంగ్రెస్ తో పొత్తు ఫైనల్ అవుతుందా లేదా అనేది  ఇవాళ మధ్యాహ్నానికి తేలనుంది. 

also read:కాంగ్రెస్‌లో చేరికలు: సీపీఐతో సీట్ల సర్ధుబాటుపై ఎఫెక్ట్, పొత్తుంటుందా?

కాంగ్రెస్ తో  సీపీఐ పొత్తు విషయమై  కూడ ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  సీపీఐకి ఇస్తానన్న  చెన్నూరు సీటును  వివేక్ వెంకటస్వామికి కేటాయిస్తారనే ప్రచారం  సాగుతుంది. దీంతో సీపీఐ కూడ అసంతృప్తితో ఉంది.  కాంగ్రెస్ తో పొత్తు విషయమై  రెండు రోజుల వరకు  ఎదురు చూస్తామని సీపీఐ  రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించిన విషయం తెలిసిందే.

సీట్ల కేటాయింపు విషయమై తాము కోరిన సీట్ల విషయంలో కాంగ్రెస్ సాచివేత ధోరణితో ఉందనే  అభిప్రాయంతో సీపీఎం ఉంది.  కాంగ్రెస్ లోని కొందరు నేతలు లెఫ్ట్ పార్టీలతో పొత్తు విషయంలో సానుకూలంగా లేరనే అభిప్రాయాన్ని లెఫ్ట్ పార్టీల నేతలు వ్యక్తం చేస్తున్నారు.  ఇవాళ మధ్యాహ్నం  మూడు గంటల వరకు  కాంగ్రెస్ నుండి పొత్తు విషయమై స్పష్టత రాకపోతే   తమ వైఖరిని ప్రకటించనుంది సీపీఎం. 

click me!