తెలంగాణ ఎన్నికలను పురస్కరించుకొని బీఆర్ఎస్ పై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అవకాశం దొరికితే కేసీఆర్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఏ రకంగా విఫలమైందో వివరించే ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు.
హైదరాబాద్:రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ తెలంగాణ ఇంచార్జీ ప్రకాష్ జవదేకర్ విమర్శించారు. సోమవారంనాడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కేసీఆర్ సర్కార్ పై బీజేపీ చార్జీషీట్ విడుదల చేసింది. ప్రజలకు ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయలేదని కేసీఆర్ సర్కార్ పై బీజేపీ చార్జీషీట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
ఇలాంటి సర్కార్ దేశంలో లేదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ కు ప్రాజెక్టును అమ్ముకుందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీల వల్ల డ్రగ్స్, లిక్కర్ టెర్రరిజంకు చోటు దక్కిందని ఆయన విమర్శించారు. ఇస్లామిక్ టెర్రరిజం మూలాలు తెలంగాణలో ఉన్నాయని చెప్పారు. బంగ్లాదేశ్, బర్మా రోహింగ్యాలు మజ్లిస్ అండదండలతో పెరుగుతున్నాయన్నారు.
undefined
పీఎఫ్ఐ తో లింకులు ఇక్కడే బయటపడిన విషయాన్ని జవదేకర్ గుర్తు చేశారు. ఈ విషయమై ఇక్కడే కొందరిని అరెస్ట్ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎం ఒత్తిడితో పని చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
భారత దేశంలో అవినీతికి ఉదాహరణగా తెలంగాణ ప్రభుత్వాన్ని చెప్పుకోవచ్చని బీజేపీ చార్జీషీట్ కమిటీ చైర్మెన్ మురళీధర్ రావు చెప్పారు.
అవినీతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం నడవడం లేదన్నారు.
also read:బండి సంజయ్ ను అందుకే పార్టీ అధ్యక్ష పదవినుండి తప్పించారు: మురళీధర్ రావు సంచలనం
పిల్లర్లు కుంగిపోవడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బయట పడిందని ఆయన విమర్శించారు. రుణమాఫీ వడ్డీలకే సరిపడే పరిస్థితి నెలకొందని ఆయన ఎద్దేవా చేశారు. దళిత ముఖ్యమంత్రి మొదలు దళిత బంధు హామీ వరకు దగా చేశారన్నారు.2014, 2018 మేనిఫెస్టో, ప్రజల మధ్య, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించినట్టుగా చెప్పారు.
Live : BJP Chargesheet Committee will Release Chargesheet against BRS Government. https://t.co/KjoOBaerUx
— BJP Telangana (@BJP4Telangana)నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని ఆయన విమర్శించారు. సింగరేణిలో నిమ్స్ ను ఏర్పాటు, వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఇచ్చిన హామీ అమలు చేయలేదని మురళీధర్ రావు గుర్తు చేశారు.