మహాశక్తి అమ్మవారి ఆశిస్సులు పొంది... కన్నతల్లికి పాదాభివందనం చేసి నామినేషన్ వేయడానికి బయలుదేరారు కరీంనగర్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్.
కరీంనగర్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేసినా అవి చాలా తక్కువేనని చెప్పవచ్చు. ఈ నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుండి జోరందుకోనుంది. బండి సంజయ్, రేవంత్ రెడ్డి వంటి కీలక నాయకులు నేడు నామినేషన్ వేయనున్నారు.
కరీంనగర్ నియోజకవర్గంలో మంత్రి గంగుల కమలాకర్ పై బిజెపి బండి సంజయ్ ని మరోసారి బరిలోకి దింపింది. దీంతో ఇవాళ సంజయ్ నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు. ఉదయమే కరీంనగర్ లోని మహాశక్తి అమ్మవారి ఆలయానికి నామినేషన్ పత్రాలతో వెళ్లి ప్రత్యేక పూజలు చేయించారు. అమ్మవారి పాదాలవద్ద నామినేషన్ పత్రాలను వుంచి ఎన్నికల్లో గెలుపు వరించేలా దీవించాలని కోరారు.
undefined
అనంతరం తన నివాసానికి చేరుకున్న సంజయ్ కన్నతల్లి ఆశిస్సులు తీసుకున్నారు. తల్లి పాదాలకు నమస్కరించగా విజయం సాధించాలని కొడుకును ఆశీర్వదించారు. తండ్రి ఫోటోకు కూడా దండం పెట్టుకుని నామినేషన్ వేయడానికి సంజయ్ సిద్దమయ్యారు.
వీడియో
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే గంగుల కమలాకర్ పై ఓటమిపాలైన సంజయ్ వెనక్కి తగ్గలేదు. అదిష్టానాన్ని ఒప్పించి లోక్ సభ టికెట్ దక్కించుకున్నాడు. ఎంతో కష్టపడి ఏ మాత్రం ఆశలులేని చోట బిజెపిని గెలిపించి సత్తాచాటాడు. ఇలా ఎంపీగా గెలిచి బిజెపి కేంద్ర నాయకత్వం దృష్టిలో పడ్డారు సంజయ్. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారిపోయి బిజెపిలో సంజయ్ కీలక నాయకుడిగా మారిపోయాడు. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సంజయ్ తెలంగాణ బిజెపిలో మంచి ఊపు తీసుకువచ్చారు. ఇటీవలే సంజయ్ ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించినా కేంద్ర జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది బిజెపి.
Read More BJP -JANASENA: పొత్తయితే కుదిరింది.. మరీ ప్రచారం సంగతేంటీ ? జనసేనానికి ఎదురయ్యే తిప్పలేంటీ?
ఇలా గతంలో ఎలాంటి గుర్తింపు లేకుండా బరిలోకి దిగిన బండి సంజయ్ ఈ ఎన్నికల్లో కీలక నాయకుడిగా పోటీ చేస్తున్నారు. దీంతో ఈసారి సంజయ్ గెలుపు ఖాయమని ఆయన అనుచరులు, బిజెపి నాయకులు ధీమాతో వున్నారు.