తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ పై ఉత్కంఠ: చివర్లో ట్విస్ట్ ఇచ్చిన సిఈసీ

By Nagaraju TFirst Published Oct 6, 2018, 4:00 PM IST
Highlights

 తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రజలను సందిగ్ధంలో పడేసింది. తొలుత హైకోర్టులో ఓటర్ల జాబితా సవరణ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్ ప్రస్తావించారు. ఓటర్ల తుది జాబితా అంశం హైకోర్టులో ఉన్న నేపథ్యాన్ని పదేపదే ప్రకటించారు.  

ఢిల్లీ: తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రజలను సందిగ్ధంలో పడేసింది. తొలుత హైకోర్టులో ఓటర్ల జాబితా సవరణ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్ ప్రస్తావించారు. ఓటర్ల తుది జాబితా అంశం హైకోర్టులో ఉన్న నేపథ్యాన్ని పదేపదే ప్రకటించారు.  

ఓటర్ల జాబితా అవకతవకలు, జాబితా సవరణ వంటి అంశాలకు సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోందని ఈ కేసుకు సంబంధించి విచారణ ఈనెల 8న జరగనున్నట్లు తెలిపారు. వెనువెంటనే మధ్యప్రదేశ్,మిజోరాం,ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలు షెడ్యూల్ ప్రకటించారు. 

దీంతో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ లేట్ అయ్యే అవకాశం ఉందని వార్తలు గుప్పుమన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరింత లేట్ అయ్యే అవకాశం ఉందా అని అంతా సందేహం వ్యక్తం చేశారు. చత్తీష్ ఘడ్, మధ్యప్రదేశ్, మిజోరాం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రటించారు. 

వరుస షెడ్యూల్ ప్రకటిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్ తెలంగాణ ప్రస్తావన రాకపోవడంతో ఎన్నికలు మరింత ఆలస్యమేమోనని సర్వత్రా అనుమానాలు వ్యక్తమయ్యాయి. వారి అనుమానాలను పటాపంచెలు చేస్తూ ఓపీ రావత్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. రాజస్థాన్ తోపాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. 

డిసెంబర్ 7న ఎన్నికల ఫలితాలు, డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నవంబర్ 12న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ విడుదల చేయనున్నట్ల తెలిపారు. నవంబర్ 19న నామినేషన్ల ప్రక్రియకు తుది గడువుగా ప్రకటించారు. నవంబర్ 22న నామినేషన్ల ఉపసంహరణ, నవంబర్ 20న నామినేషన్ల పరిశీలన ఉంటుందని చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 
  
అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో జరగనున్నట్లు ప్రకటించింది. 119 అసెంబ్లీ నియోకవర్గాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ ఎన్నికల సంఘం. ఈవీఎం,వీవీప్యాట్ లపై అన్ని రాజకీయ పార్టీ నేతలకు అవగాహన కల్పించింది. ఈవీఎంలపై నెలకొన్న సందేహాలను సైత నివృత్తి చేసింది. 

తొందర్లోనే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సామాగ్రిని ఇప్పటికే పలు  జిల్లాలకు తరలించినట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన లోపు తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎన్నికల నిర్వహణ సామాగ్రి తరలించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 

click me!