ఉత్తమ్! కిరణ్ రెడ్డి కాళ్లు పట్టుకున్నావు: కేటీఆర్

By pratap reddyFirst Published Oct 6, 2018, 2:27 PM IST
Highlights

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత కేటి రామారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి పదవి కోసం ఆ రోజుల్లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాళ్లు పట్టుకున్నావని ఆయన ఆయన ఉత్తమ్ పై ధ్వజమెత్తారు. 

హైదరాబాద్: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత కేటి రామారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి పదవి కోసం ఆ రోజుల్లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాళ్లు పట్టుకున్నావని ఆయన ఆయన ఉత్తమ్ పై ధ్వజమెత్తారు. 

తెలంగాణ భవన్ లో శనివారం జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. తాను సైనికుడినని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుకుంటున్నారని, ఉద్యమంలో విద్యార్థులు వీర సైనికుల్లో పోరాటం చేస్తుంటే మరి ఈ సైనికుడు ఎక్కడ ఉన్నాడని ఆయన అడిగారు. తాను మాట్లాడితే బచ్చా అంటారని, కాంగ్రెసు నేతలు దద్దమ్మల్లా ఇళ్లలో ఉంటే ఈ బచ్చాగాళ్లే తెలంగాణ తెచ్చారని ఆయన అన్నారు. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి సైనికుడు కాడని, బంట్రోతు అని ఆయన అన్నారు. కాంగ్రెసు చోటా మోటా నాయకులు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు నేతలకు బలుపు ఎక్కువని ఆయన అన్నారు. 

కాంగ్రెసు నేత మల్లు భట్టి విక్రమార్కపై కూడా ఆయన నిప్పులు చెరిగారు. తెలంగాణ ఎన్నికలు ఓ కుటుంబానికీ ప్రజలకూ మధ్య జరుగుతున్న పోరాటమని భట్టి విక్రమార్క అంటున్నారని, నిజానికి ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ కుటుంబానికీ తెలంగాణ ప్రజలకు మధ్య జరుగతున్న పోరాటమని కేటీఆర్ అన్నారు. రాహుల్ కుటుంబానికీ తెలంగాణ పౌరుషానికి మధ్య జరుగుతున్న పోటీ అని అన్నారు.

1956 నుంచి 2014 వరకు తెంలగాణను మోసం చేసిన రాహుల్ గాంధీ కుటుంబానికీ తెలంగాణ ప్రజలకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకుల మాటలు వింటుంటే కడుపు మండుతోందని అన్నారు కాంగ్రెసుకు ఓటు దెబ్బతోనే సమాధానం చెప్పాలని అన్నారు. 

ఏ అమర వీరుల కటుుంబం వచ్చి టీడీపీతో కాంగ్రెసు పొత్తు పెట్టుకోవాలని టీజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కు చెప్పిందని ఆయన అడిగారు. ముష్టి మూడు సీట్ల కోసం కోదండరామ్ కాంగ్రెసు వద్ద పొర్లు దండాలు పెడుతున్నారని అన్నారు. 

click me!