Maheswaram election result 2023: మహేశర్వంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘన విజయం! 

By Sambi Reddy  |  First Published Dec 3, 2023, 3:18 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. అయితే  మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు. 
 


మహేశ్వరంలో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సబితా రెడ్డి ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిపై 27000 మెజారిటీతో సబితా ఇంద్రారెడ్డి గెలించింది. బీజేపీ తరపున శ్రీరాములు యాదవ్ పోటీ చేశారు. బీఆర్ఎస్ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలా మంది ఓటమి కాగా సబితా ఇంద్రారెడ్డి గెలుపొందారు. అత్యంత ప్రజావ్యతిరేకత మధ్య బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆమె గెలుపొందారు.   

కాగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్ హవా నడుస్తుంది. కొన్ని ఏరియాల్లో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. ఖమ్మంతో పాటు దక్షిణ, ఉత్తర తెలంగాణలలో కాంగ్రెస్ సత్తా చాటుతుంది. సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దాటింది. ప్రస్తుత ఫలితాల ప్రకారం 38 నియోజకవర్గాలలో గెలిచింది. 27 నియోజకవర్గాల్లో లీడింగ్ లో ఉంది. 

Latest Videos

ఎన్నికల రిజల్ట్స్ లైవ్ అప్డేట్స్

click me!