Telangana Assembly Election Results 2023: ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో విజేతలు వీరే..  ఏ నియోజకవర్గంలో ఎవరు గెలి

By Rajesh KarampooriFirst Published Dec 4, 2023, 2:13 AM IST
Highlights

తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్‌ (Congress) ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో హైదరాబాద్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల రిజల్ట్ ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు అనే విషయాలు చూద్దాం..
 

తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్‌ (Congress) ఘన విజయం సాధించింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలకు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ నుంచి 64 మంది అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కాగా బీఆర్ఎస్‌ పార్టీ 41 స్థానాలకు పరిమితం అయింది. మరోవైపు బీజేపీ ఎనిమిది స్థానాల్లో, ఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేశాయి. 

ఈ నేపధ్యంలో హైదరాబాద్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల రిజల్ట్ ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు అనే విషయాలు చూద్దాం.. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఓటర్ నాడి పరిశీలిస్తే.. ఇక్కడ మిశ్రమ స్పందన వచ్చింది. ఉమ్మడి రంగారెడ్డి లో 15 స్థానాలు ఉండగా.. 7 స్థానాలను ఎంఐఎం హస్త గతం చేసుకోగా..  గులాబీ పార్టీ 7 గురు అభ్యర్థులను గెలుచుకుంది. మిగితా ఒక స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది.
 
Hyderabad Assembly Election Results: ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలుపొందిన వారి జాబితా ఇదే!

నెం. నియోజకవర్గం గెలుపొందిన అభ్యర్ధి పార్టీ 
 
1 ముషీరాబాద్ ముఠా గోపాల్ బీఆర్ఎస్
2 మలక్ పేట్     అహ్మద్ బిన్ అబ్దులా బలాల ఎంఐఎం
3 అంబర్ పేట కాలేరు వెంకటేష్ బీఆర్ఎస్
4 ఖైరతాబాద్ దానం నాగేందర్ బీఆర్ఎస్
5 జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్
6 సనత్ నగర్ తలసాని శ్రీనివాస్ బీఆర్ఎస్
7 నాంపల్లి మహ్మద్ మసీద్ ఉస్సేన్ ఎంఐఎం 
8 కార్వాన్ కౌసర్ మోహినుద్దీన్  ఎంఐఎం 
9 గోషామహల్ రాజాసింగ్ బీజేపీ
10 చార్మినార్     జుల్పీకర్ అహ్మద్ ఆలీ ఎంఐఎం
11 చాంద్రాయణ గుట్ట అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం
12 యాకుత్పురా జఫ్పర్ హుస్సేన్ ఎంఐఎం
13 బహదూర్పురా మహ్మద్ ముబీన్ ఎంఐఎం
14 సికింద్రాబాద్ టి. పద్మారావు బీఆర్ఎస్
15 కంటోన్మెంట్ (ఎస్సీ) లాస్య నందిత బీఆర్ఎస్
click me!