జహీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ గెలుచుకుంది. ఆ పార్టీ అభ్యర్థి కోనింటి మాణిక్ రావు ఘన విజయం సాధించారు.
జహీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ క్యాండిడేట్ మాణిక్ రావు మొదటి నుండి ఆధిక్యం ప్రదర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్, బీజేపీ అభ్యర్థి రాజ నర్సింహ వెనుకబడ్డారు. జహీరాబాద్ నియోజకవర్గం షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వ్డ్ నియోజకవర్గం కాగా మూడు ప్రధాన పార్టీల నుండి అభ్యర్థులు బరిలో నిలిచారు. ఫైనల్ రౌండ్ ముగిసే నాటికి కాంగ్రెస్ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్ పై కోనింటి మాణిక్ రావు 12790 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
మొత్తంగా కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటింది. అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటింది. కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అధికార బీఆర్ఎస్ 39 స్థానాలకు పరిమితమైంది. పలువురు మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓటమిపాలయ్యారు. రాష్ట్రంలో పుంజుకున్న బీజేపీ 8 స్థానాల్లో గెలుపొంది ప్రభావం చూపింది. జనసేన ఘోర ఓటమి మూటగట్టుకుంది. కూకట్ పల్లి మినహాయిస్తే 7 చోట్ల జనసేన డిపాజిట్లు కోల్పోయింది. ఎమ్ఐఎమ్ తన 7 నియోజకవర్గాలు కాపాడుకుంది.
ఎన్నికల రిజల్ట్స్ లైవ్ అప్డేట్స్