సీట్ల సర్ధుబాటు విషయమై కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుతో సీపీఎం అసంతృప్తితో ఉంది. తాము కోరిన సీట్లు ఇవ్వకపోతే పొత్తు ఉండదని సీపీఎం నాయకత్వం తేల్చి చెబుతుంది.
హైదరాబాద్: తాము అడిగిన సీట్లు ఇవ్వకపోతే కాంగ్రెస్ తో పొత్తు ఉండదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తేల్చి చెప్పారు. నవంబర్ 1వ తేదీన సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు విషయమై సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం నాడు చర్చించింది. తాము అడిగిన సీట్లను ఇవ్వాల్సిందేనని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.నవంబర్ 1న మరోసారి సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. మిర్యాలగూడతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక అసెంబ్లీ స్థానం ఇవ్వాలని సీపీఎం కోరుతుంది. అయితే హైద్రాబాద్ పాతబస్తీలో ఒక అసెంబ్లీ సీటుతో పాటు అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీని ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రతిపాదించింది.
undefined
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు సీటు ఇవ్వకపోతే వైరా ఇవ్వాలని సీపీఎం ప్రతిపాదిస్తుంది. అయితే వైరాలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించడం కూడ సీపీఎం నాయకులకు ఆగ్రహం తెప్పించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని సీపీఐకి కేటాయించేందుకు కాంగ్రెస్ సానుకూలంగా ఉంది. అయితే తమకు ఒక్క సీటు ఇవ్వడానికి కాంగ్రెస్ నేతలు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని సీపీఎం ప్రశ్నిస్తుంది. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇవాళ మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ తో పొత్తు విషయమై ఆయన స్పష్టత ఇవ్వనున్నారు. తమ పార్టీ కోరిన సీట్లు కాంగ్రెస్ ఇచ్చే పరిస్థితి లేకపోతే ఒంటరిగా పోటీ చేయాలని సీపీఎం భావిస్తుంది.
also read:కాంగ్రెస్ తాజా ప్రతిపాదన: పొత్తుపై నేడు తేల్చనున్న సీపీఎం రాష్ట్ర కార్యవర్గం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఎంకు ఒక్క అసెంబ్లీ సీటును ఇవ్వడాన్ని ఆ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు.ఈ జిల్లాలో అసెంబ్లీ సీటును తమకు కేటాయించకపోతే పొత్తు అవసరం లేదని సీపీఎం నేతలు తేల్చి చెబుతున్నారు.
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు ప్రకటించాయి. అయితే బీఆర్ఎస్ మాత్రం ఈ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల మద్దతు లేకుండానే బీఆర్ఎస్ పోటీ చేస్తుంది. దీంతో సీపీఐ, సీపీఎంలతో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కారణంగా సీపీఐ, సీపీఎంలతో చర్చలు జరుపుతుంది.ఇవాళ నిర్వహించిన సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కాంగ్రెస్ ప్రతిపాదనలపై చర్చించారు. అయితే కాంగ్రెస్ తీరుపై ఈ సమావేశం అసంతృప్తిని వ్యక్తం చేసింది.
తాము కోరిన సీట్లు ఇవ్వాలని సీపీఎం డిమాండ్ చేసింది. లేకపోతే ఒంటరిగా బరిలోకి దిగాలని ఆ పార్టీ భావిస్తుంది. నవంబర్ 1వ తేదీన సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం మరోసారి జరగనుంది. కాంగ్రెస్ ప్రతిపాదనలపై ఇవాళ మధ్యాహ్నం తమ్మినేని వీరభద్రం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.