ఫిబ్రవరి మూడు నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: నోటిఫికేషన్ జారీ

By narsimha lodeFirst Published Jan 31, 2023, 5:40 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి  3వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు  ఇవాళ  నోటిఫికేషన్ విడుదలైంది

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు   ఫిబ్రవరి  3వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు   నోటిఫికేషన్ మంగళవారం నాడు విడుదలైంది. తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు  అదే రోజున ప్రారంభమౌతాయి.   మధ్యాహ్నం  12: 10 గంటలకు   అసెంబ్లీ సమావేశాలు  ప్రారంభం కానున్నాయి.  తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలిని ఉద్దేశించి  గవర్నర్ తమిళి సై సౌందర రాజన్   ప్రసంగించనున్నారు.   గత  సమావేశాలకు  కొనసాగింపుగానే  ఈ  సమావేశాలు  ప్రారంభం కానున్నాయి.  

తెలంగాణ అసెంబ్లీ  బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకొని  గవర్నర్ ప్రసంగం  ఉంటుందని  నిన్న  హైకోర్టుకు  ప్రభుత్వం తెలిపింది.  బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలపలేదని  రాష్ట్ర ప్రభుత్వం  దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై  నిన్న హైకోర్టు  విచారణ నిర్వహించింది.ఈ విచారణ  సమయంలో    రాజ్యాంగ బద్దంగా  ప్రభుత్వం వ్యవహరిస్తుందని  ప్రభుత్వ తరపు న్యాయవాది  దుశ్వంత్ ధవే హైకోర్టుకు తెలిపారు.  

హైకోర్టుకు ఇచ్చిన హామీ మేరకు  నిన్న  రాత్రి  రాజ్ భవన్ లో  గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో  తెలంగాణ మంత్రి   వేముల ప్రశాంత్ రెడ్డి  భేటీ అయ్యారు.  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకొని  గవర్నర్ కు మంత్రి ఆహ్వానం పలికారు.  బడ్జెట్ సమావేశాలను  ప్రారంభించాలని  గవర్నర్ ను  ప్రశాంత్ రెడ్డి కోరారు.

also read:రాజ్ భవన్ కు మంత్రి ప్రశాంత్ రెడ్డి: బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ కు ఆహ్వానం

గత  ఏడాది తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు  గవర్నర్ ప్రసంగం లేకుండానే  పూర్తయ్యాయి.  కానీ ఈ దఫా మాత్రం గవర్నర్  తమిళిసై సౌందర రాజన్  బడ్జెట్ సమావేశాలను  ప్రారంభించనున్నారు.   ఫిబ్రవరి  6వ తేదీన  ప్రభుత్వం  బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది.  నిన్న రాత్రి  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి  గవర్నర్ తో భేటీ అయిన నేపథ్యంలో  బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు. 
 

click me!