బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి సంస్థల్లో ఐటీ అధికారుల సోదాలు

By narsimha lode  |  First Published Jan 31, 2023, 4:37 PM IST

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  వెంకట్రామిరెడ్డికి చెందిన సంస్థల్లో   ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 


హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  వెంకట్రాంరెడ్డి కి  చెందిన  సంస్థలు , ఇంట్లో మంగళవారం నాడు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  ఇవాళ ఉదయం  నుండి  ఐటీ అధికారులు  సోదాలు చేస్తున్నారు.  వసుధ ఫార్మా,  రాజ్ పుష్ప,  వెరిటెక్స్, ముప్పా  సంస్థల్లో   51 ప్రాంతాల్లో  ఐటీ అధికారులు సోదాలు  చేస్తున్నారని   ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్  ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.   రాజ్ పుష్ప,   సంారెడ్డి జిల్లా తెల్లాపూర్ లో  ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని   ఆ కథనం తెలిపింది.  ఐదు వాహనాల్లో   వచ్చిన   ఐటీ అధికారులు   ఎమ్మెల్సీ  సంస్థల్లో  సోదాలు   నిర్వహిస్తున్నట్టుగా  ఆ చానెల్  కథనం వివరించింది.  

ఎమ్మెల్సీ  వెంకట్రాంరెడ్డికి  చెందిన  సంస్థలకు  చెందిన  ప్రతినిధులను   ఐటీ శాఖ అధికారులు  ప్రశ్నిస్తున్నారని  ఈ కథనం తెలిపింది.  గత కొంతకాలంగా  హైద్రాబాద్ కేంద్రంగా  పలు రియల్ ఏస్టేట్ సంస్థలపై  ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయ పన్ను శాఖాధికారులు  చేసిన సోదాల కారణంగా   కీలక సమాచారాన్ని అధికారులు  సేకరించారు. ఈ సమాచారం ఆధారంగా  ఐటీ శాఖ అధికారులు   సోదాలు చేస్తున్నారని  సమాచారం. 
వెంకట్రాంరెడ్డికి చెందిన  సంస్థలు చెల్లించిన  టాక్స్ లకు సంబంధించి కూడా  అధికారులు  సరి చూస్తున్నారని  ఆ కథనం వివరించింది.  ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డికి చెందిన సంస్థల్లో   మరో రెండు రోజుల పాటు  సోదాలు  కొనసాగే అవకాశం ఉందని  సమాచారం. 

Latest Videos

click me!