Minister Gangula: బీసీల ఉన్నతికి సీఎం కేసీఆర్‌ కృషి : మంత్రి గంగుల

Published : Feb 28, 2022, 03:23 PM IST
Minister Gangula: బీసీల  ఉన్నతికి సీఎం కేసీఆర్‌ కృషి : మంత్రి గంగుల

సారాంశం

Minister Gangula: వెన‌క‌బ‌డిన త‌రగ‌తుల‌(బీసీ) ఉన్నతి కోసం తెలంగాణ ప్ర‌భుత్వం విశేష కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమ‌వారం నాడు రవీంద్రబారతిలో ఫిబ్ర‌వ‌రి 28 ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా తెలంగాణ మేరు సంఘం నిర్వహించిన ప్రపంచ టేలర్స్ డే వేడుకలకు మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  

Minister Gangula: వెన‌క‌బ‌డిన త‌రగ‌తుల‌(బీసీ) ఉన్నతి కోసం తెలంగాణ ప్ర‌భుత్వం విశేష కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమ‌వారం నాడు రవీంద్రబారతిలో ఫిబ్ర‌వ‌రి 28 ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా తెలంగాణ మేరు సంఘం నిర్వహించిన ప్రపంచ టేలర్స్ డే వేడుకలకు మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల మాట్లాడుతూ.. నేతన్న నేసిన వస్త్రాన్ని మనిషికి తగ్గట్టు అందంగా మలిచేది దర్జీలని, వారు కుట్టిన బట్టలతోనే హుందాతనం వస్తుందని అన్నారు. విలియమ్స్ హౌవో ఫిబ్ర‌వ‌రి 28న కుట్టుమిషన్ కనుగొన్న సందర్భంగా టైలర్లందరికీ గుర్తింపు ల‌భించింద‌ని అన్నారు. అంతర్జాతీయ టైలర్స్ డే సందర్భంగా మంత్రి గంగుల .. మేరు కులస్థులకు, టైలర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం చేయని విధంగా మేరు కులస్థులకు హైదరాబాద్ లోని అత్యంత విలువైన ఉప్పల్ బగాయత్లో ఎకరా స్థలంతో పాటు కోటి రూపాయలను సీఎం కేసీఆర్ కేటాయించిన‌ట్టు తెలిపారు. బీసీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ.. ఉన్నత వర్గాలకు దీటుగా బీసీ గురుకులాల్లో విద్యను అందిస్తున్నామ‌ని అన్నారు. భవిష్యత్తులోనూ మేరు కులస్థులకు అండగా ఉంటామని, ఇంత గొప్పగా ఆదరణ చూపుతున్న ముఖ్యమంత్రికి ప్రతీ ఒక్కరం రుణపడి ఉండాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ ను మేరు కులస్థులు సన్మానించారు.

        ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ.. టైలర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు, బీసీ సంక్షేమ శాఖలో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో శరవేగంగా పనులు జరుగుతున్నాయని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీసీలకు సమగ్ర న్యాయం చేయగలరని ఇచ్చిన అవకాశాన్ని అద్బుతంగా నిర్వహిస్తున్నారన్నారు. మద్యతరగతి బీసీ కుటుంబంలో పుట్టిన గంగుల ఆత్మగౌరవం తెలిసిన వ్యక్తి కాబట్టే ప్రతీ బీసీ కులానికి ఆత్మగౌరవం చేకూరేలా ఆత్మగౌరవ భవనాల నిర్మాణం చేపడుతున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, మేరు సంఘం తెలంగాణ అధ్యక్షులు కీర్తి ప్రభాకర్, ఇత‌ర నేతలు దీకొండ నర్సింగరావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

Purandeswari Pays Tribute to NTR: ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన పురందేశ్వరి | Asianet News Telugu
NTR 30th Vardanthi: ఎన్టీఆర్ ఘన నివాళి అర్పించిన నందమూరి కళ్యాణ్ రామ్| Asianet News Telugu