తెలంగాణ అసెంబ్లీలో ముగిసిన బీఏసీ సమావేశం.. 6వ తేదీన బడ్జెట్.. షెడ్యూల్ ఇలా..

By Sumanth KanukulaFirst Published Feb 3, 2023, 2:04 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం ముగిసింది. వర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం సభలో చర్చించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.

తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం ముగిసింది. ఈరోజ మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్ తమిళిసై ప్రసంగంతో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహిచారు. బీఏసీ సమావేశానికి పలువురు మంత్రులు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం సభలో చర్చించాలని నిర్ణయించారు. ఈ నెల 6వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా.. 8వ తేదీ నుంచి బడ్జెట్, పద్దులపై చర్చించనున్నారు. 

బీఏసీ సమావేశానికి హాజరైన సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క.. అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహిచాలని కోరారు. అలాగే ప్రోటోకాల్ సమస్యను కూడా ప్రస్తావించారు. చాలా సమస్యలపై చర్చించాల్సి ఉందని అన్నారు. తొలుత బడ్జెట్‌పై చర్చ తర్వాత మిగిలిన అంశాలు చర్చిద్దామని ప్రభుత్వం తెలిపింది. ఇక, సమావేశాల కొనసాగింపుకు సంబంధించి ఈ నెల 8వ తేదీన మరోసారి బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. 

Also Read: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. తెలంగాణ దేశానికి ఆదర్శంగా మారింది: గవర్నర్ తమిళిసై

బీఏసీ సమావేశం అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 25 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరగాలని కోరినట్టుగా చెప్పారు. బీఏసీ సమావేశానికి ప్రతిపక్షాలను అన్నింటినీ పిలిస్తే బాగుండేదని అన్నారు. బడ్జెట్‌పై 6 రోజులు, డిమాండ్లపై 18 రోజులు చర్చ ఉండాలని కోరానని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగం, ప్రజాసమస్యలపై చర్చ జరగాలని కోరినట్టుగా చెప్పారు. 

click me!