
TS 10th Class Results: లక్షలాది మంది పదో తరగతి విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న టెన్త్ రిజల్ట్స్ నేడు ( మే 10న)వెల్లడి కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది జరిగిన పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 4,86,194 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 4,84,384 మంది హాజరు కాగా.. 1,809 మంది పరీక్షలకు గైర్హాజరు అయ్యారు. అలాగే.. ప్రైవేటుగా 443 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 191 మంది మాత్రమే హాజరయ్యారు.
పదో తరగతి ప్రశ్నాప్రతాల మూల్యాకనం ఏప్రిల్ 14న ప్రారంభమై.. ఏప్రిల్ 21వ తేదీ వరకు కొనసాగింది. ఈ సారి మొత్తం మొత్తం 18 సెంటర్లలో మూల్యాకన ప్రక్రియ నిర్వహించారు. అయితే.. ఈ ఫలితాల్లో తప్పులు దొర్లకుండా ట్రయల్ రన్ కూడా నిర్వహించినట్టు సమాచారం. అన్ని విధాలుగా టెక్నికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసిన అధికారులు మే 10న ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించారు.ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు.
ఫలితాల కోసం ఇలా చెక్ చేసుకోండి..
>> పదో తరగతి పరీక్ష ఫలితాలను చెక్ చేసుకోవాలంటే..
>> తొలుత https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లండి
>> SSC Results పై క్లిక్ చేయండి.
>> మీ హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేయండి.
>> సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
>> ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
>> ప్రింట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.