తెలంగాణ గవర్నర్‌ తమిళిసై బర్త్‌డే: గ్రీటింగ్స్ చెప్పిన కేసీఆర్

Published : Jun 02, 2021, 12:06 PM IST
తెలంగాణ గవర్నర్‌ తమిళిసై బర్త్‌డే: గ్రీటింగ్స్ చెప్పిన కేసీఆర్

సారాంశం

 తెలంగాణ సీఎం కేసీఆర్  రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.   

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్  రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం నాడు రాజ్‌భవన్ లో గవర్నర్  తమిళిపైతో భేటీ అయ్యారు.ఇవాళ  పుట్టిన రోజుల జరుపుకొంటున్న గవర్నర్ ను కలిసి ఆయన గ్రీటింగ్స్ తెలిపారు. 

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళిపై సౌందరరాజన్  2019 సెప్టెంబర్ 8 వతేదీన గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు.  తెలంగాణకు తొలి మహిళా గవర్నర్ గా ఆమె బాధ్యతలు చేపట్టారు.2019 సెప్టెంబర్ 1న  ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు  కొత్త గవర్నర్లను నియమించారు. 

ఉమ్మడి ఏపీ రాష్ట్రంతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు  నరసింహన్ సుదీర్ఘకాలం పాటు గవర్నర్ గా పనిచేశారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్ ఆమె జన్మస్థలం. బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఆమె పనిచేశారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఈ సమయంలోనే ఆమె విద్యార్థి సంఘంలో పనిచేశారు. 

 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ