అక్కడ స్నానం చేయద్దు అన్నందుకు.. రోకలిబండతో కొట్టి హత్య..

Published : Jun 02, 2021, 11:37 AM IST
అక్కడ స్నానం చేయద్దు అన్నందుకు.. రోకలిబండతో కొట్టి హత్య..

సారాంశం

చిన్న విషయాలకే ప్రాణాలు తీస్తున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లో ఇలాంటి సంఘటనే జరిగింది. చేతి పంపు వద్ద స్నానం చేయవద్దన్నందుకు ఓ వ్యక్తిని రోకలితో మోది దారుణంగా హత్య చేశారు. 

చిన్న విషయాలకే ప్రాణాలు తీస్తున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లో ఇలాంటి సంఘటనే జరిగింది. చేతి పంపు వద్ద స్నానం చేయవద్దన్నందుకు ఓ వ్యక్తిని రోకలితో మోది దారుణంగా హత్య చేశారు. 

మంగళవారం అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇన్ స్పెక్టర్ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా, జలాల్ పూర్ ప్రాంతానికి చెందిన పురుషోత్తం రెడ్డి(35) గత కొంత కాలం క్రితమే నగరానికి వచ్చాడు. 

చాదర్ ఘాట్ సమీపంలో ఉన్న సాయిబాబా దేవాలయం దగ్గర ఉంటూ ప్రసాదాలు, దాతలు ఇచ్చే ఆహారం తింటూ ఫుట్ పాత్ మీద నివాసం ఉండేవాడు. కాగా మంగళవారం దేవాలయం సమీపంలో ఉన్న చేతి పంపు వద్ద నేపాల్ కు చెందిన బహద్దూర్  (30) చేతులు శుభ్రం చేసుకుంటున్నాడు.

పెద్దల ఆచారం.. మహిళ ప్రాణం తీసింది..!...

అక్కడికి వెళ్లిన పురుషోత్తం రెడ్డి ఇక్కడ చేతులు కడుక్కోవద్దని అభ్యంతరం చెప్పాడు. ఈ విషయం మీద ఇద్దరి మధ్య స్వల్ప వివాదం తలెత్తింది. దీంతో కోపోద్రిక్తుడైన బహద్దూర్ పురుషోత్తం రెడ్డి మీద రోకలి బండతో దాడి చేశాడు. ఈ దాడిలో గాయాలు బలంగా తాకడంతో పురుషోత్తం రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి విషమించి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. 

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ ఏసీపీ దేవేందరు, అఫ్జల్ గంజ్ ఇన్ స్పెక్టర్ రవీందర్ రెడ్డి, ఎస్సై మాన్ సింగ్, క్లూస్ టీం, వేలిముద్రల నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 

ఆలయ పరిసరాల్లోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమారం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్యకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Real Estate : లక్షల్లో పెట్టుబడి, కోట్లలో లాభం ! హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నెక్స్ట్ డెస్టినేషన్ ఇదే
YCP Leaders Protest Against ABN Weekend Comment Over Controversial Remarks | Asianet News Telugu