వివాహితతో సహజీవనం... ఆమె కూతురిపై కన్నేసి..

Published : Jul 07, 2020, 07:54 AM ISTUpdated : Jul 07, 2020, 08:00 AM IST
వివాహితతో సహజీవనం... ఆమె కూతురిపై కన్నేసి..

సారాంశం

ఆ వ్యాపారి మాత్రం వివాహిత కుమార్తె పై కన్నేశాడు.  కాగా... ఇటీవల సదరు మహిళ తన సోదరితో కలిసి బయటకు వెళ్లింది. ఈ సమయాన్ని తనకు అవకాశంగా మార్చుకున్నాడు ఆ వ్యాపారి.  

ఆమెకు పెళ్లై.. ఓ కుమార్తె కూడా ఉంది. కానీ.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే... ఆమె అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి మాత్రం సదరు మహిళ కూతురిపై కన్నేశాడు. ఆ మహిళ లేని సమయంలో.. ఆమె కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన ఓ వివాహితకు.. 17ఏళ్ల కుమార్తె ఉంది. కాగా.. సదరు మహిళ అదే ప్రాంతానికి ఓ వ్యాపారి(50) తో అక్రమ సంబంధం పెట్టుకుంది.అయితే.. ఆ వ్యాపారి మాత్రం వివాహిత కుమార్తె పై కన్నేశాడు.  కాగా... ఇటీవల సదరు మహిళ తన సోదరితో కలిసి బయటకు వెళ్లింది. ఈ సమయాన్ని తనకు అవకాశంగా మార్చుకున్నాడు ఆ వ్యాపారి.

వివాహిత లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లి... మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరించడం గమనార్హం. ఇంటికి వచ్చిన తర్వాత కుమార్తె ద్వారా నిజం తెలుసుకున్న వివాహిత.. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కాగా.. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే