పార్క్ హయత్ కేసులో కొత్త కోణాలు: 4 నెలలుగా ఉక్రెయిన్ మహిళకు గది

Published : Jul 06, 2020, 08:03 PM IST
పార్క్ హయత్ కేసులో కొత్త కోణాలు: 4 నెలలుగా ఉక్రెయిన్ మహిళకు గది

సారాంశం

హైద్రాబాద్ పార్క్ హయత్ కేసులో పోలీసుల దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. నాలుగు నెలలుగా ఉక్రెయిన్ మహిళ పేరు మీద ఈ హోటల్‌లో రూమ్ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.  


హైదరాబాద్: హైద్రాబాద్ పార్క్ హయత్ కేసులో పోలీసుల దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. నాలుగు నెలలుగా ఉక్రెయిన్ మహిళ పేరు మీద ఈ హోటల్‌లో రూమ్ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.

పార్క్ హయత్ హోటల్ లో రూమ్ నెంబర్ 721  ని ఉక్రెయిన్ మహిళ పేరు మీద ఉంది. సంతోష్ రెడ్డికి ఉక్రెయిన్ మహిళ మేనేజర్ గా పనిచేస్తోంది. నాలుగు మాసాల నుండి సంతోష్ రెడ్డి ఇదే రూమ్ లో పార్టీలతో జల్సాలు చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. హైద్రాబాద్ కు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి అల్లుడితో ఇదే హోటల్ రూమ్ లో సంతోష్ రెడ్డి పార్టీలు నిర్వహించినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

పార్క్ హయత్ హోటల్ లో  సంతోష్ రెడ్డి, కేశవరావు, రఘువీర్ రెడ్డి, భాను కిరణ్ తో పాటు నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 12 సెల్ ఫోన్లతో పాటు పెద్ద మొత్తంలో నగదును కూడ  పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ రూమ్ లో పార్టీల విషయంలో సంతోష్ రెడ్డి, రఘువీర్ రెడ్డి పాత్రలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

iBomma Ravi : అసలు ఐబొమ్మ నాది అని చెప్పింది ఎవడు..? ఫస్ట్ టైమ్ నోరువిప్పిన రవి !
Bandi Sanjay About Akhanda 2: బాలకృష్ణలో సీనియర్ ఎన్టీఆర్ ని చూసా: బండి సంజయ్ | Asianet News Telugu