మోదీ నుండి యోగి వరకు... బిజెపి అగ్ర నాయకత్వమంతా తెలంగాణలోనే... క్యాంపెనర్ల లిస్టిదే..

By Arun Kumar P  |  First Published Nov 6, 2023, 1:30 PM IST

కాస్త లేటయినా లేటెస్ట్ గా ప్రచారం నిర్వహించడానికి బిజెపి సిద్దమయ్యింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అగ్రనాయకత్వం మొత్తం ప్రచారంలో పాల్గొననున్నట్లు ప్రకటించారు. 


హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలన్ని ప్రచార జోరును మరింత పెంచాయి. ఇప్పటికే  బిఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ తో పాటు ఆ పార్టీ నాయకులంతా ప్రజల్లోనే వుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్, ప్రియాంక గాంధీ లను రంగంలోకి దింపడంతో పాటు రేవంత్ రెడ్డి , భట్టి విక్రమార్క వంటి నాయకులు విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారం విషయంతో బిజెపి కాస్త వెనకబడిందనే చెప్పాలి.

అయితే కాస్త ఆలస్యమైనా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు బిజెపి సిద్దమయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీతో సహా జాతీయ నాయకత్వం మొత్తాన్ని తెలంగాణలో దింపుతోంది బిజెపి. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించే నాయకుల జాబితాను భారతీయ జనతా పార్టీ విడుదల చేసింది. ఇప్పటినుండి అసలుసిసలైన ఎన్నికల ప్రచారం ఎలా వుంటుందో ప్రత్యర్థులకు చూపిస్తామని తెలంగాణ బిజెపి నాయకులు చెబుతున్నారు. 

Latest Videos

undefined

Read More  అమ్మవారిని పూజించి... అమ్మ ఆశిస్సులు పొంది..: నామినేషన్ వేసేందుకు బయలుదేరిన బండి సంజయ్ (వీడియో)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే బిజెపి అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి జాతీయాధ్యక్షులు జెపి నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ ఇలా కేంద్ర నాయకత్వం మొత్తం ప్రచారం చేపట్టనుంది. అలాగే కిషన్ రెడ్డి, బండి సంజయ్, కె. లక్ష్మణ్, డికె అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, ఈటల రాజేందర్, గరికపాటి మోహన్ రావు, రాజాసింగ్, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సోయం బాపురావు వంటి రాష్ట్ర నాయకత్వం కూడా   ప్రచారంలో పాల్గొననున్నారని బిజెపి తెలిపింది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా తెలంగాణలో ప్రచారం చేపట్టనున్నారు.  
 
తెలంగాణలో ప్రచారం చేపట్టే నాయకుల లిస్ట్ : 

click me!