ఉద్యోగంలో చేరాల్సిన రోజే టెక్కీ దారుణ హత్య

Published : May 02, 2019, 10:53 AM IST
ఉద్యోగంలో చేరాల్సిన రోజే టెక్కీ దారుణ హత్య

సారాంశం

ఉద్యోగంలో చేరాల్సిన రోజునే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి  రోహిత్ సామ్యూల్ దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


హైదరాబాద్: ఉద్యోగంలో చేరాల్సిన రోజునే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి  రోహిత్ సామ్యూల్ దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 హైద్రాబాద్‌లోని తార్నాకలో విజయపురి కాలనీకి చెందిన నజ్రీనారావు కొడుకు జాషువా రోహిత్ సామ్యూల్ ఓ కాల్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. అయితే అతనికి ఇటీవలనే జెన్‌పాక్‌లో ఉద్యోగం వచ్చింది. బుధవారం నాడు  రోహిత్ కొత్త ఉద్యోగంలో చేరాల్సి ఉంది. బుధవారం నాడు మౌలాలి రైల్వే స్టేషన్ పొదల్లో ఓ యువకుడి మృతదేహాన్ని  స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మృతదేహం వద్ద లభ్యమైన  గుర్తింపు కార్డుల ద్వారా అతడిని సామ్యూల్‌గా గుర్తించారు. ఘటన స్థలంలో మద్యం సేవించిన ఆనవాళ్లు కూడ లభ్యమయ్యాయి. ఘటన స్థలాన్ని డీసీపీ ఉమా మహేశ్వరరావు సందర్శించారు.

మద్యం బాటిళ్లను సికింద్రాబాద్‌లోని ఓ మద్యం దుకాణంలో కొనుగోళ్లు చేసినట్టుగా గుర్తించారు. మృతుని వద్ద రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.  ఈ ఫోన్ కాల్ డేటాను పోలీసులు సేకరిస్తున్నారు. రోహిత్ ఇంటి వద్ద సీసీటీవీ పుటేజీని కూడ పోలీసులు పరిశీలిస్తున్నారు. అర్ధరాత్రి వరకు ఇంట్లోనే ఉన్న రోహిత్  తెల్లవారుజామున వరకు హత్యకు గురయ్యారని పోలీసులు భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం
Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?