సీఎల్పీ నేత భట్టికి అస్వస్థత: కిమ్స్ కు తరలింపు

Published : May 02, 2019, 09:59 AM IST
సీఎల్పీ నేత భట్టికి అస్వస్థత: కిమ్స్ కు తరలింపు

సారాంశం

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గంలో వారికి వ్యతిరేకంగా భట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తున్నారు. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో వీలైనన్ని స్థానాల్లో విజయం సాధించాలని భట్టి వ్యూహరచన చేస్తున్నారు. 

ఖమ్మం: తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజులుగా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తున్న భట్టి బుధవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. 

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గంలో వారికి వ్యతిరేకంగా భట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తున్నారు. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో వీలైనన్ని స్థానాల్లో విజయం సాధించాలని భట్టి వ్యూహరచన చేస్తున్నారు. 

ఒకవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరును ఎండగడుతూనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. అయితే నాలుగు రోజులుగా మండుటెండల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తున్న తరుణంలో బుధవారం వడదెబ్బకు గురయ్యారు. ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోవడంతో ఆయనను ఖమ్మంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం భట్టి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్