
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చారిత్రాత్మకమైన చార్మినార్ కు ముప్పు పొంచి ఉన్నట్లే కనిపిస్తోంది. మరమ్మతులు చేస్తుండగా చార్మినార్ కు చెందిన ఓ పిల్లర్ కు చెందిన కొంత భాగం కూలిపోయింది. ఈ సంఘటన బుదవారంనాడు జరిగింది.
16వ శతాబ్దికి చెందిన చార్మినార్ కు మరమ్మతులు చేస్తుండగా ఓ భాగం కూలుతూ వచ్చింది. అందుకు గల కారణమేమిటనేది తెలియదు. ఆర్కియోలిజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు గురువారం దాన్ని పరిశీలించే అవకాశం ఉంది.
చార్మినార్ పునరుద్ధరణకు సుత్తిలు, ఇతర పదునైన పరికరాలు వాడారని స్థానికులు అంటున్నారు. హైదరాబాదుకు చార్మినార్ సంకేతంగా ఉంటూ వస్తోంది.