హైద్రాబాద్‌ గచ్చిబౌలిలో విషాదం: టెక్కీ కృతి సంబ్యాల్ సూసైడ్

Published : Jun 02, 2022, 02:54 PM ISTUpdated : Jun 02, 2022, 03:01 PM IST
హైద్రాబాద్‌ గచ్చిబౌలిలో  విషాదం: టెక్కీ కృతి సంబ్యాల్ సూసైడ్

సారాంశం

హైద్రాబాద్ గచ్చిబౌలిలో టెక్కీ కృతి సంబ్యాల్ ఆత్మహత్య చేసుకొంది. తన రూమ్ లో ఒంటరిగా ఉన్న కృతి ఆత్మహత్య చేసుకొంది. ఆత్మహత్య చేసుకొంటున్నట్టుగా తన స్నేహితుడు సచిన్ కు ఆమె మేసేజ్ పెట్టింది.


హైదరాబాద్: Hyderabad గచ్చిబౌలిలో టెక్కీ కృతి సంబ్యాల్ ఆత్మహత్య చేసుకొంది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెందిన కృతి సంబ్యాల్ Gachibowli  నానక్‌రాంగూడలో సాగర్ గార్డినియా అపార్ట్ మెంట్ లో ఆమె నివాసం ఉంటుంది. ఇద్దరు రూమ్‌మేట్స్‌తో కలిసి kriti sambyal  నివాసం ఉంటుంది. Amazon కంపెనీలో ఆమె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. కృతి రూమ్ మేట్ ఒకరు Delhi వెళ్లింది. మరొకరు బయటకు వెళ్లింది.  అయితే గదిలో ఒంటరిగా ఉన్న కృతి Suicideచేసుకుంది. బుధవారం నాడు మధ్యాహ్నం స్నేహితుడు sachin Kumar కు మేసేజ్ పంపింది. 

అతను వచ్చేసరికి కృతి  అచేతన స్థితిలో ఉంది. దీంతో అతను ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే ఆమె చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు. ఈ విషయమై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కృతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

జీవితం మీద విరక్తితో ఓ మహిళా టెక్కీ బలవన్మరణానికి పాల్పడింది. 2020 నవంబర్ 20న చోటు చేసుకొంది. తనకు బతకాలని లేదంటూ తన సోదరికి చెప్పిన రెండు రోజులకే మహిళా టెక్కీ ఇలా ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకొంది. నామాలగుండ ఉప్పరబస్తీకి చెందిన వస్త్ర వ్యాపారి రంగన్‌ గోవిందరాజ్, శీల దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె గోవిందరాజు సుస్మిత (21) క్లాక్‌టవర్‌ ప్రాంతంలోని టెక్‌ మహీంద్రాలో ఈ ఏడాది అక్టోబర్‌ 30న శిక్షణ కోసం చేరింది. శిక్షణ పూర్తయిన అనంతరం ఈ నెల 13న ఇక్కడే అసోసియేట్‌ కస్టమర్‌ సపోర్ట్‌గా విధులు నిర్వహిస్తోంది.

also read:నెల్లూరులో దారుణం: పెళ్లికి నిరాకరించిందని కావ్యను కాల్చి చంపి టెక్కీ ఆత్మహత్య

ప్రతి రోజు ఉదయం గోవిందరాజ్‌ కుమార్తెను తన ద్విచక్ర వాహనంపై తీసుకువచ్చి కార్యాలయం వద్ద వదలి వెళుతుంటారు.  ఆఫీసుకి వెళ్లిన తర్వాత ఆరో అంతస్తులోని క్యాంటిన్‌కు వెళ్లి అక్కడి నుంచి వాష్‌రూమ్‌కు వెళ్లింది. బాత్రూం పక్కనే ఉన్న గదిలోకి వెళ్లి చైర్లు వేసుకుని పైకి ఎక్కి గ్రిల్స్‌ లేని కిటికి నుంచి కిందకు దూకింది. వెంటనే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది హుటాహుటిన అక్కడికి వెళ్లి పరిశీలించగా అప్పటికే చనిపోయింది. విషయం తెలుసుకున్న గోపాలపురం పోలీసులు అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఓ మహిళా టెక్కీ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో  2020  ఫిబ్రవరి 13న చోటుచేసుకుంది. ఒడిశా గంజాంలోని స్వప్నేశ్వర్ ప్రాంతానికి చెందిన రాజ్యలక్ష్మి(25) కొంతకాలం క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చింది. మాదాపూర్లో ఉంటోంది.జూబ్లీహిల్స్ లోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. గుట్టల బేగంపేటలోని సిద్ధివినాయక ఉమెన్స్ హాస్టల్ లో ఉంటూ రోజూ ఆఫీసుకి వెళ్లేది. హాస్టల్ లోని తోటి రూమ్ మెట్స్ తమ విధుల నిమత్తం ఆఫీసులకు వెళ్లగా రాజ్యలక్ష్మి ఒక్కతే గదిలో ఉంది. రాత్రి 12గంటల 30 నిమిషాల సమయంలో రూమ్ మేట్ నవీన హాస్టల్ కి తిరిగి వచ్చింది.  గదిలోకి వచ్చి చూడగా రాజ్యలక్ష్మి ఆత్మహత్య చేసుకొని కనపడింది.

PREV
click me!

Recommended Stories

రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu
రాష్ట్రంలోమంత్రులంతా దొరికిందిదోచుకోవడమే: KTR Comments on CM Revanth Reddy | Asianet News Telugu