Tamilisai Birthday: మీరే నేటి యువతకు ఆదర్శమూర్తి: గవర్నర్ తమిళిసై కి పవన్ భర్త్ డే విషెస్

Arun Kumar P   | Asianet News
Published : Jun 02, 2022, 02:23 PM ISTUpdated : Jun 02, 2022, 02:27 PM IST
Tamilisai Birthday: మీరే నేటి యువతకు ఆదర్శమూర్తి: గవర్నర్ తమిళిసై కి పవన్ భర్త్ డే విషెస్

సారాంశం

తెలంగాణ అవతరణ దినోత్సవం రోజునే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుట్టినరోజు కావడంతో ఆమెకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ భర్త్ డే విషెస్ తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ అవతరణ దినోత్సవం (telangana formation day 2022) రోజునే రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan Birthday) పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు రాజకీయ, సినీ, వ్యాపారం ఇలా వివిధ రంగాల్లోని ప్రముఖలు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇలా జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కల్యాణ్ (pawan kalyan) గవర్నర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసారు. 

''గౌరవనీయ తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాజకీయ కుటుంబంలో జన్మించి, వైద్య శాస్త్రాన్ని అధ్యయనం చేసి వైద్య వృత్తిలో ఎన్నో విజయాలను చవిచూసిన శ్రీమతి తమిళిసై గారు నేటి యువతులకు ఆదర్శమూర్తిగా భావిస్తున్నాను'' అంటూ పవన్ కొనియాడారు. 

''వైద్య సేవలు అందిస్తూనే కుటుంబ నేపథ్యంగా వచ్చిన రాజకీయ రంగాన కూడా ఆమె తనదైన పాత్రను పోషిస్తూ నేడు గౌరవప్రదమైన గవర్నర్ స్థాయికి ఎదిగారు. ఒక్క తెలంగాణకే కాకుండా పుదుచ్చేరి రాష్ట్రానికి కూడా ఇంచార్జి గవర్నర్ గా ఆమె నియమితులవ్వడం ఆమెలోని పరిపాలన దక్షతకు నిదర్శనం. చిత్తశుద్ధితో.. ప్రజలకు ప్రేమతో సేవలందిస్తే పదవులు వాటంతటవే వస్తాయి అనడానికి శ్రీమతి తమిళిసై గారు నిలువెత్తు తార్కాణం. శ్రీమతి తమిళిసై గారికి ఆ భగవంతుడు శతాయుష్షును ప్రసాదించాలని, ప్రజాసేవలో ఆమె చిరంతనంగా మమేకం కావాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అంటూ పవన్ ఓ ప్రకటన విడుదల చేసారు. 

ఇక తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కూడా గవర్నర్ కు భర్త్ డే విషెస్ తెలిపారు. ''తెలంగాణ గవర్నర్, పుదుచ్చెరి లెఫ్టినెంట్ గవర్నర్ డా. తమిళిసై గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.  మీ సేవాభావం, ప్రజాసంక్షేమం కోసం చూపిస్తున్న చొరవ అభినందనీయం. మరింతగా దేశసేవ చేసేందుకు భగవంతుడు మీకు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతున్నాను'' అంటూ బండి సంజయ్ ట్వీట్ చేసారు.

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి కిషన్ రెడ్డి కూడా తెలంగాణ గవర్నర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ''గౌరవ తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మన ప్రజలకు సేవ చేసేందుకు ఆ దేవుడు మీకు మంచి ఆరోగ్యం, ఆయురారోగ్యాలు ప్రసాధించాలని కోరుకుంటున్నా'' అంటూ కిషన్ రెడ్డి సోషల్ మీడియా వేదికన విషెస్ తెలిపారు. 

ఇక తెలంగాణ బిజెపి ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందర్ రావు, ఈటల రాజేందర్, ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు కూడా గవర్నర్ తమిళిసైకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బిజెపి శ్రేణులు కూడా గవర్నర్ కు భర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!