హైదరాబాద్ లో జమ్మూకశ్మీర్ యువతి ఆత్మహత్య..!

Published : Jun 02, 2022, 10:16 AM IST
హైదరాబాద్ లో జమ్మూకశ్మీర్ యువతి ఆత్మహత్య..!

సారాంశం

జమ్మూకశ్మీర్ రాష్ట్రం సంబా జిల్లాలోని మండి తలోరా ప్రాంతానికి చెందిన కృతి సంబ్యాల్(27).. గత సంవత్సరన్నరగా.. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తోంది.

జమ్మూకశ్మీర్ కి చెందిన ఓ యువతి హైదరాబాద్ లో బలవన్మరణానికి పాల్పడింది. జమ్మూకి చెందిన సదరు యువతి(27) హైదరాబాద్ నగరంలోని ఓ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.కాగా.. సడెన్ గా సదరు యువతి సీలింగ్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం గమానార్హం.

గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జమ్మూకశ్మీర్ రాష్ట్రం సంబా జిల్లాలోని మండి తలోరా ప్రాంతానికి చెందిన కృతి సంబ్యాల్(27).. గత సంవత్సరన్నరగా.. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తోంది.

ఆమె మరో ఇద్దరితో కలిసి నానక్ రామ్ గూడ ప్రాంతంలో ఉంటోంది. కాగా.. బుధవారం మధ్యహ్నం ఆమె స్నేహితుడు సచిన్ కుమార్ ఆమెను కలిసేందుకు ఆమె ఉంటున్న ఇంటికి వచ్చాడు. ఎంత సేపు డోర్ కొట్టినా ఆమె తలుపు తీయలేదు. దీంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా.. ఆమె ఫ్యాన్ కి ఉరి వేసుకొని కనిపించింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తీసుకు వెళ్లగా...  అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు.

కాగా.. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఆమెతోపాటు ఇద్దరు యువతులు కూడా ఆ ఇంట్లో ఉంటుండగా.. ఒకరు ఢిల్లీ వెళ్లారు. మరొకరు పని మీద ఆఫీసుకు వెళ్లారు. కాగా.. ఆమె మరణ వార్తను ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Air Pollution : హైదరాబాద్ మరో డిల్లీ అవుతోందా..! ఈ ప్రాంతాల్లో మరీ ఇంత కాలుష్యమా..!!
Hyderabad: ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో మాదాపుర్ కావ‌డం ఖాయం