హైద్రాబాద్ జీడిమెట్లలో పేలుడు: నలుగురికి గాయాలు

By narsimha lode  |  First Published Jun 2, 2022, 9:24 AM IST

హైద్రాబాద్ నగరంలోని జీడిమెంట్ల వెంకటాద్రినగర్ లో గురువారం నాడు ఉదయం పేలుడు చోటు చేసుకొంది.ఈ పేలుడులో నలుగురికి గాయాలయ్యాయి. ఈ పేలుడుకు గల కారణాలపై పోలీసలు దర్యాప్తు చేస్తున్నారు.


హైదరాబాద్: Hyderabad నగరంలోని Jeedmetla వెంకటాద్రి కాలనీలోని ఖాళీ ప్రదేశంలో గురువారం నాడు ఉదయం పేలుడు చోటు చేసుకొంది.  ఈ Blast లో నలుగురికి గాయాలయ్యాయి.  ఈ ఘటనలో గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుడుకు గల కారణాలపై Police దర్యాప్తు చేస్తున్నారు.ఈ  ప్రాంతంలో పేలుడు పదార్ధాలు ఎలా వచ్చాయనే విషయమై పోలీసులు  ఆరా తీస్తున్నారు. ఈ నెల 1వ తేదీన జీడిమెట్ల సుభాష్ నగర్ లో జనావాసాల మధ్యే గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న సమయంలో పేలుడు చోటు చేసుకొంది.ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నిన్ననే ఈ ప్రాంతంలో గ్యాస్ రీ ఫిల్లింగ్ ఘటనలో పేలుడులో ఒకరు మరణించగా, ఇవాళ మరో ఘటనలో నలుగురు గాయపడ్డారు.వరుస ఘటనలతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఇళ్ల మధ్యే గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తున్న సమయంలో ముకుంద్  అనే యువకుడు మరణించాడు. ముకుంద్ శరీరం రెండు ముక్కలైంది. ;ప్రమాదం జరిగిన సమయంలో ఇక్కడే ఉన్న విజయ్, కుమార్  అనే ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరిని సూరారం ఆసుపత్రికి తరలించారు.

Latest Videos

undefined

also read:హైద్రాబాద్‌ జీడిమెట్లలో జనావాసాల మధ్యే గ్యాస్ రీఫిల్లింగ్,పేలుడు: ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

ఇంటి సెల్లార్ ప్రాంతంలో గ్యాస్ రీఫిల్లింగ్  చేస్తున్నారని స్థానికులు అధికారులకు పిర్యాదు చేస్తున్నారు. రెండేళ్ల నుండి జవాసాల మధ్యే గ్యాస్ రీఫిల్లింగ్ చస్తున్నారు.  స్థానికుల ఫిర్యాదులను అధికారులు పట్టించుకోలేదు. ఈ నెల 1న గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ వాల్వ్ లీక్ కావడంతో పేలుడు చోటు చేసుకొందని స్థానికులు అనుమానిస్తున్నారు.

తాము పదే పదే ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్దంగా జనావాసాల మధ్యే గ్యాస్ రీ పిల్లింగ్ చేస్తుండడంతో స్థానికులు భయంతో గడుపుతున్నారు. అధికారులు పట్టించుకొంటే ఇవాళ ఈ ప్రమాదం జరిగేది కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.  గ్యాస్ రీ పిల్లింగ్  చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. జనవాసాల మధ్య అసలు చేయకూడదు. ఈ నిబంధనలను పట్టించుకోలేదు. రెండేళ్లుగా సుభాష్ నగర్ లో యధేచ్చగా గ్యాస్ రీపిల్లింగ్ కొనసాగుతుందని స్థానికులు చెప్పారు.

గ్యాస్ సిలిండర్ ప్రమాదాలతో పాటు అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న సమయంలో  ప్రమాదాలు గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి. 2021 నవంబర్ 23న  హైదరాబాద్ నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని నానక్ రామ్ గూడలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు దాటికి ఇళ్లు మొత్తం ధ్వంసం అవడమే కాదు భారీగా మంటలు చెలరేగి 11మంది గాయపడ్డారు.  

ఈ విషయమై  ఎన్డీఆర్ఎఫ్, పోలీస్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా గాయపడిన వారిని కాపాడి దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. అనంతరం ఎగసిపడుతున్న మంటలను అదుపుచేశారు. ఈ గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఈ ఏడాది మే 28న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు చనిపోయాు. శెట్టూరు మండలం ములకలేడులోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్  పేలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. సిలిండర్ పేలుడు ధాటికి ఇంటి పై కప్పు కూడా కూలింది.

 

click me!