
హైదరాబాద్; ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో BJP కూడా కీలక పాత్ర పోషించిందని కేంద్ర మంత్రి Kishan Reddy చెప్పారు.గురువారం నాడు న్యూఢిల్లీలో Telangana Formation Day వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. National Flag మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్రం తరపున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు.
ఈ ఉత్సవాలను అమరులకు అంకితం చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.. తెలంగాణ సాధనలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ బిల్లు కోసం పార్లమెంట్ లో అప్పట్లో రాజ్‌నాథ్ సింగ్, సుష్వాస్వరాజ్ పోరాటం చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రత్యేక తెలంగాణ కోసం . బీజేపీ ఎంపీలు కూడా పోరాటం చేశారన్నారు.