రాజుల కాలం తర్వాత అంత అద్బుతంగా నిర్మాణమైన దేవాలయం యాదాద్రి అని ప్రశంసల జల్లు కురిపించారు. కేసీఆర్ సనాతన ధర్మాన్ని గుర్తించి యాదాద్రిని మహాక్షేత్రంగా తీర్చిదిద్దారన్నారు.
యాదాద్రి నిర్మాణంతో కేసిఆర్ చరిత్రలో నిలిచిపోతారని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి కొనియాడారు. తెలంగాణలో మత సామరస్యంతో కేసీఆర్ పాలన సాగుతోందని Swarupanandendra Saraswati Swami అన్నారు.
undefined
రాజుల కాలం తర్వాత అంత అద్బుతంగా నిర్మాణమైన దేవాలయం యాదాద్రి
అని ప్రశంసల జల్లు కురిపించారు. కేసీఆర్ సనాతన ధర్మాన్ని గుర్తించి యాదాద్రిని మహాక్షేత్రంగా తీర్చిదిద్దారన్నారు.
కేసీఆర్ మైలురాళ్లలో తెలంగాణ సాధనతో పాటు యాదాద్రి నిర్మాణం కూడా చిరస్థాయిగా నిలుస్తుందని స్వరూపానందేంద్ర స్వామి చెప్పుకొచ్చారు. యాదాద్రిలో వేదిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రారంభానికి సిద్దమయ్యింది. వచ్చే ఏడాది మార్చిలో ఆలయాన్ని reopeningకు ముహూర్తం ఖరారు చేసినట్లు ముఖ్యమంత్రి KCR ఇటీవలే ప్రకటించారు.
ఈ క్రమంలోనే గర్భాలయ విమాన గోపురానికి Tirumalaలో మాదిరిగా స్వర్ణతాపడం చేయించాలని నిర్ణయించినట్లు... ఇందుకోసం దాతల నుండి బంగారాన్ని స్వీకరించనున్నట్లు సీఎం తెలిపారు.
Yadadri నరసింహస్వామి దేవాలయ నిర్మాణానికి తోచినంత సాయం చేసే అవకాశం దక్కడంతో ప్రజలు ముందుకు వస్తున్నారు. తమకు కలిగిన దాంట్లో ఎంతో కొంత ఆ యాదగిరీషుడికి సమర్పించుకోవాలని భావిస్తున్నారు.
సీఎం కేసీఆర్ పిలుపుతో యాదాద్రి దేవాలయానికి బంగారం విరాళంగా ఇవ్వడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తేరా చిన్నప రెడ్డి ఒక కిలో బంగారం బహూకరించనున్నట్లు ప్రకటించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ భక్తికి, గొప్ప సంకల్పానికి తాను చాలా ప్రేర పొందానని... అందుకోసమే నా కుటుంబం, శ్రీని ఫార్మా గ్రూపు కంపెనీల తరపున బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్లు చిన్నప రెడ్డి తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మీద భక్తితో ఒక కిలో బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్ ప్రకటించారు.
ఆధునిక చరిత్రలో ఒక ప్రజా పరిపాలకుడు ఇంత గొప్ప వైభవంగా ఒక ఆలయాన్ని పునర్నిర్మించడం ఒక అద్భుతమని దానం పేర్కొన్నారు. సీఎం ఎంతో గొప్ప సంకల్పంతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చేపట్టారని... అందుకు తనవంతు సాయంగా బంగారం విరాళంగా ఇస్తున్నట్లు దానం తెలిపారు.
యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన సమయంలోనే తన కుటుంబం తరపున కిలో బంగారాన్ని అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. అలాగే మంత్రి మల్లారెడ్డి, చినజీయర్ స్వామి ఆశ్రమం, మంత్రి హరీష్ తదితరులు కూడా బంగారం ఇవ్వడానికి సిద్దంగా వున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ పిలుపు మేరకు చాలామంది ముందుకు వచ్చి యాదాద్రి ఆలయానికి బంగారాన్ని విరాళంగా ఇస్తున్నారు.