విషాదం : దొంగల నుంచి తప్పించుకునే యత్నం, రైలు కిందపడి టెక్కీ దుర్మరణం

Siva Kodati |  
Published : Jun 30, 2023, 02:40 PM IST
విషాదం : దొంగల నుంచి తప్పించుకునే యత్నం, రైలు కిందపడి టెక్కీ దుర్మరణం

సారాంశం

బీబీ నగర్‌లో దొంగల బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ టెక్కీ రైలు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న శ్రీకాంత్‌గా గుర్తించారు.

తెలంగాణలో దారుణం జరిగింది. బీబీ నగర్‌లో దొంగల బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ టెక్కీ రైలు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాంత్ అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. పవిత్రమైన తొలి ఏకాదశి, ఈద్ ఉల్ అదా నాడు ఈ ఘటన జరిగింది. అతను శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో వరంగల్‌కు వెళ్తున్నాడు. హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో పనిచేస్తున్న శ్రీకాంత్ స్వగ్రామానికి వెళ్లేందుకు అతను సికింద్రాబాద్‌లో రైలెక్కాడు. ఈ సమయంలో పడిపోతున్న ఫోన్‌ని పట్టుకునే ప్రయత్నంలో శ్రీకాంత్ చేతుల్లో నుంచి మొబైల్ జారిపడిపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే రైలు కిందపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే బీబీ నగర్ సమీపంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కర్రతో దాడి చేసి శ్రీకాంత్ ఫోన్ దొంగిలించేందుకు ప్రయత్నించారని పోలీసులు చెప్పారు. 

మరోవైపు.. ఓ చోరీ ప్రయత్నం దాతృత్వంగా మారింది. ఓ జంటను దోచుకోవాలని నిర్ణయించుకున్న ఇద్దరు దొంగలు చివరికి వారికే డబ్బులు ఇచ్చి పరారయ్యారు. అవునండీ.. మీరు చదివింది నిజమే.. ఈ విచిత్ర ఘటన ఢిల్లీలోని షహదారాలోని ఫర్ష్ బజార్ లో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు దొంగలు తుపాకీతో దంపతులను దోచుకునేందుకు ప్రయత్నించి, వారికే డబ్బులు ఇచ్చి వెళ్లిపోయిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీ రికార్డు అయ్యాయి. ఇవి ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి.

ALso Read: మంచి దొంగలు.. జేబులో రూ.20 నోటు మాత్రమే దొరకడంతో దంపతులకే డబ్బులిచ్చి, స్కూటీపై పరారీ.. వీడియో వైరల్

వివరాలు ఇలా ఉన్నాయి. షహదారాలోని ఫర్ష్ బజార్ లో రాత్రి సమయంలో ఓ జంట నడుచుకుంటూ వెళ్తోంది. ఈ సమయంలో వారి వద్దకు ఇద్దరు వ్యక్తులు స్కూటర్ పై వచ్చారు. ఈ దంపతుల దగ్గర స్కూటీ ఆపి తుపాకీతో బెదిరించారు. అనంతరం వారిని దోపిడి చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో వారిద్దరూ తాగి, తలకు హెల్మెట్ పెట్టుకొని ఉన్నారు. చోరీ చేయాలనే ఉద్దేశంతో ఒక దొంగ ఆ వ్యక్తి జేబులను వెతికాడు. 

కానీ అతడి జేబులో కేవలం రూ.20 నోటు మాత్రమే దొరికింది. దీంతో ఆ దొంగ నిరాశ చెందారు. ఆ దంపతుల వద్దనే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని భావించారో ఏమో తెలియదు కానీ.. ఆ దొంగలే తిరిగి వారికి రూ.100 నోటు ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను జర్నలిస్ట్ రవి జల్హోత్రా ట్విటర్ లో షేర్ చేశారు. ‘‘విపరీతంగా తాగి ఉన్న దొంగలు వచ్చి బాధితులకు డబ్బులు చెల్లించారు. ఎందుకంటే తమ వద్దే డబ్బులు లేవని, తన గర్ల్ ఫ్రెండ్ వేసుకున్న నగలు కూడా నకిలీవి అని చెప్పడంతో అలా చేశారు’’ అని ఆయన క్యాప్షన్ పెట్టారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్