భట్టి ఫీడ్ బ్యాక్ ఆధారంగా కాంగ్రెస్ మేనిఫెస్టో: రేవంత్ రెడ్డి

By narsimha lode  |  First Published Jun 30, 2023, 2:06 PM IST

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  నిర్వహించిన పాదయాత్రలో గుర్తించిన  అంశాల ఆధారంగా  తమ పార్టీ మేనిఫెస్టో ఉంటుందని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.



ఖమ్మం: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నిర్వహించిన  పాదయాత్రలో గుర్తించిన  అంశాల ఆధారంగా కాంగ్రెస్ మేనిఫెస్టో  ఉంటుందని  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి ప్రకటించారు. 

శుక్రవారంనాడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ఖమ్మం జిల్లాలోని తల్లంపాడులో  మీడియాతో మాట్లాడారు.  జూలై  రెండున  ఖమ్మంలో  నిర్వహించే  కాంగ్రెస్ బహిరంగ  సభపై  చర్చించేందుకు  భట్టి విక్రమార్కతో  రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు . ఈ సందర్భంగా  రేవంత్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లా నుండి  ప్రజల సమస్యలను తెలుసుకుంటూ  మల్లు భట్టి విక్రమార్క  పాదయాత్రను  కొనసాగిస్తున్నారని  రేవంత్ రెడ్డి  చెప్పారు. భట్టి విక్రమార్క  పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకే  కాదు తెలంగాణ ప్రజలకు మేలు కల్గిస్తుందని  రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజల సమస్యలను  తెలుసుకుంటూ  భట్టి విక్రమార్క పాదయాత్ర సాగిందని  ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ పాలన  నుండి  విముక్తి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని  రేవంత్ రెడ్డి  అభిప్రాయపడ్డారు. కేసీఆర్  పాలనలో  ప్రజల కష్టాలను  భట్టి విక్రమార్క ప్రత్యక్షంగా  చూశారన్నారు. భట్టి విక్రమార్క పాదయాత్ర  4 కోట్ల ప్రజలను మేల్కోపిందని ఆయన  చెప్పారు.  

Latest Videos

also read:మల్లు భట్టి విక్రమార్కతో రేవంత్ రెడ్డి భేటీ:జూలై 2న ఖమ్మం సభపై చర్చ

జూలై రెండున ఖమ్మంలో  నిర్వహించే  జనగర్జన సభకు  ఖమ్మం  జిల్లాకు  చెందిన మంత్రి  అడ్డుకుంటున్నారని  ఆయన ఆరోపించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలను అద్దెకు ఇవ్వవద్దని  బెదిరింపులకు  దిగుతున్నాడని  ఖమ్మం మంత్రిపై రేవంత్ రెడ్డి  విమర్శలు  చేశారు.  ఖమ్మం  సభ ద్వారా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు  కాంగ్రెస్ పార్టీకి కిక్ స్టార్ట్ గా మారనుందని  రేవంత్ రెడ్డి  చెప్పారు.

click me!