Child Pornography: చిన్నపిల్లల అశ్లీల వీడియోలతో గలీజ్ దందా... కరీంనగర్ సాప్ట్ వేర్ అరెస్ట్

By Arun Kumar PFirst Published Oct 8, 2021, 10:31 AM IST
Highlights

చిన్నారుల అశ్లీల వీడియోలతో గలీజ్ దందా చేస్తున్న ఓ సాప్ట్ వేర్ ను కరీంనగర్ పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు.

కరీంనగర్: ఈజీ మనీ కోసం గలీజ్ దందా చేస్తున్న ఓ సాప్ట్ వేర్ ఉద్యోగిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్న పిల్లలకు సంబంధించిన అశ్లీల వీడియోలను కావాలంటే తనను సంప్రదించాలని ప్రచారం చేసుకుని... డబ్బులు చెల్లించిన వారికి వీడియోలు పంపిస్తున్నాడు సాఫ్ట్ వేర్ ఉద్యోగి వంగల మధుకర్ రెడ్డి. Child Pornography వీడియోల గలీజ్ దందా గురించి సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. 

ఈ చైల్డ్ ఫోర్నోగ్రఫీకి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ కు చెందిన మధుకర్ రెడ్డి సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అయితే ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా మనీ సంపాదించాలని భావించిన అందుకోసం చైల్డ్ పోర్నోగ్రఫిని ఎంచుకున్నాడు. 

read more  అమానుషం : చిన్నారులకు చాక్లెట్ల ఆశ చూపి.. అత్యాచారం..!

వివిధ సోషల్ మీడియా మాద్యమాల ద్వారా చిన్న పిల్లల అశ్లీల వీడియోలు(చైల్డ్ పోర్నోగ్రఫి) కావాలంటే సంప్రదించాలంటూ ప్రచారం చేసుకున్నాడు. దీంతో వీడియోల కోసం అతడిని సంప్రదించిన వారినుండి డబ్బులు వసూలు చేసి ఇంటర్ నెట్ ద్వారా అశ్లీల వీడియోలు డౌన్లోడ్ చేస్తూ లింకులు పంపించేవాడు. ఇలా గలీజ్ పని చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న అతడి దందాపై పోలీసులకు సమాచారం అందింది. 

వీడియో

దీంతో ఉమెన్ సేఫ్టీ వింగ్  ఎస్పీ రఘువీర్ ఆధ్వర్యంలో సీఐడీ, ఎల్ఎండి పోలీసులు కలిసి నిందితుని ఇంటిపై దాడి చేసి తనిఖీ చేపట్టారు. అతడి మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ ను పోలీసులు పరిశీలించగా ఇప్పటివరకు 1200 చైల్డ్ ఫోర్నోగ్రఫి వీడియోలను ఇతరులకు పంపించి రూ.30 వేల వరకు సంపాదించాడని ఏసిపి విజయ్ సారథి తెలిపారు. నిందితుడు మధుకర్ రెడ్డి దగ్గర గల ఫోన్, ల్యాప్ టాప్ సిజ్ చేసి రిమాండ్ కు తరలించామని ఏసిపి తెలిపారు.

ఇలాంటి వీడియోలు అత్యాచారాలకు దారి తీస్తుంటాయని ఏసిపి పేర్కొన్నారు. మహిళల రక్షణలో భాగంగానే ఇలాంటి వీడియోలతో బిజి నెస్ చేస్తున్న మధుకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసిపి విజయ్ సారథి వెల్లడించారు.   

click me!